- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉగ్రదాడిపై ఢిల్లీలో సంబురాలు.. కేక్ తీసుకెళ్తూ దొరికిపోయిన పాక్ హైకమిషన్ ఉద్యోగి
జమ్మూకశ్మీర్‌లోని పహెల్గాం ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో దాడి ఘటనపై పాకిస్తాన్ సంబరాలు చేసుకుంటున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జమ్మూకశ్మీర్‌లోని పహెల్గాం ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో దాడి ఘటనపై పాకిస్తాన్ సంబరాలు చేసుకుంటున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలోకి ఓ ఉద్యోగి కేక్ తీసుకుని లోపలికి వెళ్లడం సంచలనంగా మారింది. అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు అతడ్ని చుట్టుముట్టి.. ఏ సందర్భంలో ఈ కేక్‌తో లోపలికి వెళ్తున్నారంటూ ప్రశ్నించారు. సదరు వ్యక్తి ఎలాంటి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ లింక్‌లో చూడండి.
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు మొదలుపెట్టిన ఆపరేషన్ కగార్ దడ పుట్టిస్తోంది. తాజాగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారనే పక్కా సమాచారంతో గత మూడు రోజులుగా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఉత్కంఠ రేపుతోన్న ఈ ఆపరేషన్ గురించి మీరూ తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ లింక్ ఓపెన్ చేయండి.
రాజధాని అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు అంగీకరిస్తేనే అదనపు భూసేకరణ చేస్తామని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని ఏపీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. వచ్చే నెల 2వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. సభ ఏర్పాటు చేసే వేదికను మంత్రి నారాయణ, అధికారులు ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. పలు కీలక విషయాలను వెల్లడించారు. అవేంటో ఈ లింక్ ఓపెన్ చూసి చూడండి.
థాయిలాండ్‌లోని ఓ రెస్టారెంట్ బక్కగున్నోళ్లకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. చియాంగ్ యామ్‌లోని బ్రేక్ ఫాస్ట్ వరల్డ్ రెస్టారెంట్ వింత ఆఫర్లతో నెట్టింట వైరల్ అవుతోంది. రెస్టారెంట్ ముందు మెటల్ బార్స్ ఏర్పాటు చేసి ఇందుకు అనుగుణంగా డిస్కౌంట్ ఇస్తున్నది. మరి ఏ సైజ్ వారికి ఎలాంటి డిస్కౌంట్స్ ఇస్తున్నారో ఈ లింక్ ఓపెన్ చేసి మీరూ తెలుసుకోండి.






