- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పద్మ విభూషణ్ నోరి దత్తాత్రేయుడు.. ఆత్మీయ సన్మానం
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు (Nori Dattatreya) ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ (Padma Vibhushan) పురస్కారానికి డాక్టర్ నోరి ఎంపికైన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వైద్య రంగంలో, ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సలో డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అందిస్తున్న అసమానమైన సేవలను సీఎం కొనియాడారు. పద్మభూషణ్ వంటి ఉన్నత పురస్కారం లభించడం తెలుగు జాతికి గర్వకారణమని, ఆయన సేవలు తెలంగాణ ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు దత్తాత్రేయుడును శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణా రావు (CS Ramakrishna Rao), డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy), తదితరులు ఉన్నారు. తెలంగాణను ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న ‘తెలంగాణ రైజింగ్’ విజన్‌లో భాగంగా, క్యాన్సర్ నివారణ, చికిత్సపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అందిస్తున్న సూచనలు రాష్ట్రంలోని వైద్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఎంతగానో దోహదపడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.






