వైద్య రంగంలో భూంరెడ్డి సేవలు మరువ లేనివి : ఎమ్మెల్సీ కవిత

by Bhanu |

వైద్య రంగంలో భూంరెడ్డి సేవలు మరువ లేనివని, ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి పద్మ శ్రీ అవార్డు ప్రకటించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇటీవల మృతిచెందిన డాక్టర్ భూంరెడ్డి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత శుక్రవారం పరామర్శించారు.

వైద్య రంగంలో భూంరెడ్డి సేవలు మరువ లేనివి : ఎమ్మెల్సీ కవిత
X

దిశ, కరీంనగర్ టౌన్ : వైద్య రంగంలో భూంరెడ్డి సేవలు మరువ లేనివని, ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి పద్మ శ్రీ అవార్డు ప్రకటించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇటీవల మృతిచెందిన డాక్టర్ భూంరెడ్డి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత శుక్రవారం పరామర్శించారు. భూంరెడ్డి నివాసానికి చేరుకున్న ఆమె భూంరెడ్డి చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.

కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ.. స్థానిక ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో హాస్పిటల్ నెలకొల్పి వైద్య సేవలు అందించారని అన్నారు. ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి పద్మ శ్రీ అవార్డు ప్రకటించాలనీ డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు ఇవ్వాలని కోరారు.

Next Story