- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో పూర్తి కావస్తున్న వరికోతలు.. అధికారులు అప్రమత్తం
రాష్ట్రంలో పూర్తి కావస్తున్న వరికోతలు.. అధికారులు అప్రమత్తం

దిశ, వెబ్‌డెస్క్: వరి కోతలు(Paddy Harvesting) పూర్తి అవుతున్న నేపథ్యంలో యుద్దప్రాతిపదికన వ్యవసాయ సర్వీసుల రిలీజ్ చేయాలని 17 సర్కిళ్ల ఎస్ఈలను ఆదేశించారు. శుక్రవారం హన్మకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ కార్పొరేట్ కార్యాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడారు. వచ్చే మూడు నెలల వారీగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకొని అనుకున్న లక్షాలకు అనుగుణంగా వేగవంతగా వ్యవసాయ సర్వీసుల మంజూరు పనులు చేపట్టి, సర్వీసులను రిలీజ్ చేయాలని తెలిపారు.
పురోగతిలో ఉన్న సర్వీసుల మంజూరు పనులు పూర్తి చేయాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను కూడా పూర్తి చేయాలని చెప్పారు. కావాల్సిన మెటీరియల్ అందుబాటులో ఉందని, ఆలస్యం కాకుండా మంజూరు చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్‌ల సర్వీసుల మంజూరుకు సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. టీజీ ఐ-పాస్, హెచ్‌టీ(సింగిల్ విండో) సర్వీసులపైనా సమీక్షిస్తూ సర్వీసుల మంజూరులో జాప్యం లేకుండా మంజూరు చేయాలని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఈటీ సదర్ లాల్, 17 సర్కిళ్ల ఎస్ఈలు, కమర్షియల్ డీఈ జమున, ఏడీఈ మధుకర్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.






