- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gaddar Awards: తెలుగు సినిమా వాళ్లు వ్యభిచారులు... గద్దర్ అవార్డుల విషయంలో పాశం యాదగిరి వివాదాస్పద వ్యాఖ్యలు
గద్దర్ బతికే ఉంటే గద్దర్ అవార్డులను చూసి ఛీ కొట్టేవారని పాశం యాదగిరి అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: గద్దర్ అవార్డులపై సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి (Paasham Yadagiri) సంచలన వ్యాఖ్యలు. గద్దర్ అవార్డులను (Gaddar Awards) చూస్తే అన్ని రంగాలతో పాటు సినిమా రంగంలో కూడా ఇంకా ఆంధ్ర పెత్తనమే కొనసాగుతున్నట్లు అర్థం అవుతున్నదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రపెత్తదార్లను తొలగించాల్సి ఉన్నా ఆ పని చేయడం లేదన్నారు. ఈ అవార్డులకు పైన బ్రాండ్ గద్దర్ అని ఉంటే లోపల అంతా బ్రాందీ ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం గత వారం నిర్వహించిన గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ పై తాజాగా ఓ చానల్ తో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజ్ ఎవరని ప్రశ్నించారు. ఆయన ఎక్కడైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా? ఆంధ్రవాళ్ల అడుగులకు మడుగులు ఒత్తిన బానిస అని ఆ బానిసను ఎందుకు కార్పొరేషన్ చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పెట్టుకున్నారని ప్రశ్నించారు. ‘తెలుగు సినిమా వాళ్లకు సిగ్గు శరం ఏమీ లేదని వారందరూ తాగుబోతులు, వదరుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు..’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీళ్లు ఒక్క దేశభక్తి సినిమా అయినా తీశారా? ఒక్కరికి శీలం లేదని వారి మాటలను ముఖ్యమంత్రి ఎందుకు వింటున్నారు? వ్యభిచారుల మాటలు వింటారా? అని విమర్శలు గుప్పించారు. ఒక స్మగ్లర్ కు అవార్డు ఇవ్వడం ఏంటి? రజాకార్ సినిమాలో ఏమున్నదని ఆ సినిమాకు అవార్డు ఇచ్చారు అని ప్రశ్నించారు. ఈ సినిమాను తీసింది కూడా ఓ రజాకార్ అని రజాకార్లలో హిందూ రజాకార్లు, ముస్లిం రజాకార్లు ఉన్నారన్నారు.
గద్దర్ బతికుంటే ఛీ కొట్టేవారు:
గద్దర్ అవార్డు ఫంక్షన్ లో అంతా ఆంధ్రవాళ్లే ఉన్నారని, తెలంగాణవాళ్లు ఉన్నారా అని నిలదీశారు. జయసుధ ఎవరు? ఆమెకు తెలంగాణకు సంబంధం ఉందా జ్యూరీలో అంతా పనికిమాలిన వాళ్లను పెట్టారని దుయ్యబట్టారు. పనికి రాని చిల్లర మనుషులందరినీ జ్యూరీలో పెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గద్దర్ అవార్డులను మూసీ నదిలో విసిరి పారేయాలన్నారు. గద్దర్ బతికి ఉంటే ఈ అవార్డులను చూసి ఛీ కొట్టేవారని, గద్దర్ అవార్డుల తీరును చూసి గద్దర్ సతీమణి విమలక్క కంటతడి పెట్టుకుందన్నారు. ఈ అవార్డులు గద్దర్ ను అవమానించడమేనని అన్నారు. విద్య, వైద్యం, సినిమా రంగంలోనూ ఆంధ్రకార్పోరేట్ పెత్తనం నడుస్తోందన్నారు. కేసీఆర్ హయాంలో వారిదే పెద్దనం నడిచిందని ఇప్పుడూ వారిదే నడుస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇకనైనా స్పృహలోకి రావాలని లేకుంటే ప్రజలే స్పృహలోకి తీసుకువస్తారన్నారు. రేవంత్ రెడ్డికి ఎందుకు చెడ్డపేరు వస్తుందో తెలుసుకోవాలని కేసీఆర్ హయాంలో దొంగపనులు చేసిన వాళ్లంతా మీ మంత్రివర్గం, మీ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నారన్నారు.






