జూన్ 4న మా హృదయాలు బద్దలయ్యాయి: ఆర్సీబీ

by Malleboina Mahesh |

జూన్ 4న జరిగిన తొక్కిసలాటపై ఆర్సీబీ ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేసింది.

జూన్ 4న మా హృదయాలు బద్దలయ్యాయి: ఆర్సీబీ
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 లో చిరకాల వాంచ నిలబెట్టుకుంటూ మొట్టమొదటి ట్రోఫీని గెలుచుకుంది. ఈ సందర్భంగా జూన్ 4న ఏర్పాటు చేసిన సెలబ్రేషన్స్ సందర్భంగా తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ విషాద ఘటన పై ఇన్ని రోజులు స్పందించని ఆర్సీబీ యాజమాన్యం ఈ రోజు ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. అందులో.. "జూన్ 4న మా హృదయాలు బద్దలయ్యాయి. ఆర్‌సిబి కుటుంబంలోని పదకొండు మంది సభ్యులను మేము కోల్పోయాము. వారు మాలో భాగమే. మా నగరం, మా సమాజం & మా జట్టును ప్రత్యేకంగా తీర్చిదిద్దడంలో భాగం. వారి లేకపోవడం మాలో ప్రతి ఒక్కరి జ్ఞాపకాలలో ప్రతిధ్వనిస్తుంది. వారు వదిలిపెట్టిన స్థలాన్ని ఎంత మద్దతు ఇచ్చినా పూరించలేము. కానీ మొదటి అడుగుగా, అత్యంత గౌరవంతో, ఆర్‌సిబి వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹25 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఆర్థిక సహాయంగా మాత్రమే కాకుండా, కరుణ, ఐక్యత, నిరంతర సంరక్షణ యొక్క వాగ్దానంగా ఈ మొత్తం ఇచ్చాము." త్వరలో మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాము అని ఆర్సీబీ జట్టు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.

Next Story