- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విలువలు కలిగిన విద్య అందించడమే మా లక్ష్యం: భట్టి
విలువలు కలిగిన విద్య అందించడమే మా లక్ష్యం: భట్టి

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లా అల్వాల్‌లో లయోలా విద్యాసంస్థల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అసమానతలను తొలగించే శక్తి విద్యే అని అన్నారు. నైపుణ్యంతో పాటు మానవ విలువలు కలిగిన విద్య అందించడమే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలోని 100 ఐటీఐలను ఆధునిక టెక్నాలజీ సెంటర్లుగా మార్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా జీడీపీ వృద్ధికి దోహదం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే, సమాన విద్యా అవకాశాల కోసం 100 “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్” నిర్మాణం వేగంగా సాగుతోందని అన్నారు. 2047 నాటికి తెలంగాణను ₹3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో మూలధనం + ఆవిష్కరణ = ఉత్పాదకత అనే సూత్రం వైపు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్య కేవలం డిగ్రీ సంపాదనకోసం కాకుండా, విలువలు మరియు సమాజ బాధ్యతలు కలిగిన పౌరులను తీర్చిదిద్దే శక్తిగా మారాలని వెల్లడించారు. ఐదు దశాబ్దాల విజయప్రస్థానంలో లయోలా విద్యాసంస్థల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు.






