ఆడబిడ్డను ఆర్థికంగా నిలబెట్టడమే మా ప్రభుత్వ లక్ష్యం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-23 09:35:58  IST  )

ఆడబిడ్డను ఆర్థికంగా నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ఆడబిడ్డను ఆర్థికంగా నిలబెట్టడమే మా ప్రభుత్వ లక్ష్యం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆడబిడ్డను ఆర్థికంగా నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన సంగారెడ్డి (Sangareddy) జిల్లా జహీరాబాద్ (Zaheerabad) నియోజకవర్గంలో రూ.100 కోట్లతో నిర్మించిన జహీరాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. మాచనూర్‌ (Machanur)లో రూ.26 కోట్లతో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ప్రారంభించారు. అదేవిధంగా నియోజవర్గ వ్యాప్తంగా రూ.494.67 కోట్లతో చేపట్టబోయే పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం పస్తాపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. జహీరాబాద్ నియోజకవర్గంలోని హుగ్గెళ్లి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఆయన ఆశయాలు, ఆలోచనలు ఎంతో గొప్పవని అన్నారు. మెదక్ జిల్లాతో ఇందిరా గాంధీది వియదీయరాని అనుబంధమని తెలిపారు. ఆమె మెదక్ ఎంపీగా కొనసాగుతుండగానే అమరులవ్వడం బాధకరమరని అన్నారు. జహీరాబాద్ అభివృద్ధిలో గీతారెడ్డి కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.

వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం..

మెదక్ జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గేట్ వే ఆఫ్ ఇండస్టీస్‌గా జహీరాబాద్ కావాలని కృషి చేస్తామని అన్నారు. జహీరాబాద్ పారిశ్రామరిక వాడ భూసేకరణలో అన్యాయం జరిగిందనే విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. భూములిచ్చిన రైతులుకు పరిహారం పెంచామని తెలిపారు. జహీరాబాద్ నిమ్జ్‌లో భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని అన్నారు. అదేవిధంగా జహీరాబాద్‌కు అవసరం అయిన నిధులు కేటాయిస్తామని కామెంట్ చేశారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని.. అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకుని పోతామని తెలిపారు. ముఖ్యంగా నారాయణ ఖేడ్ అభివృద్ధికి ప్రత్యేకంగా సమీక్ష చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

సింగూరు ప్రాజెక్ట్‌ను ఎకో టూరిజం కింద తీర్చిదిద్దుతాం..

భవిష్యత్తులో మెదక్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని అన్నారు. సింగూరు ప్రాజెక్ట్‌ను ఎకో టూరిజం కింద అభివృద్ధి చేస్తామని తెలిపారు. అందుకు త్వరలోనే నిధులు కూడా మంజూరు చేస్తామని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చి వెంటనే రైతులను అప్పుల బాధ నుంచి విముక్తి చేశామని పేర్కొన్నారు. రైతు భరోసా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. గత ప్రభుత్వంలోని నాయకులు వరి వేస్తే ఉరే అని చెప్పేవారని రాష్ట్రంలో ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధి నా బాధ్యత..

రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి వెళ్లినా ఉచితంగా ప్రయాణిస్తున్నారని.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత్ ప్రయాణం కోసం రూ.5 వేల కోట్లకు పైగా కేటాయించామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు కంకణం కట్టుకున్నామని అన్నారు. అదానీ, అంబానీలతో పోటీపడి వ్యాపారం చేసేలా మహిళలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఆడబిడ్డను ఆర్థికంగా నిలబెట్టడమే మా లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 60 వేల ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు తమకు అండగా ఉంటే.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ అధినేత కేంద్ర మీద అడిగి ఫామ్‌హౌజ్‌లో పడుకున్నాడని.. చెరువు మీద అలిగితే ఎవరికి నష్టం.. మనకే నష్టం కదా అని ప్రస్తావించారు. అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తా.. ఎవరేం అనుకున్నా తనకు ఇబ్బంది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Next Story