- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bhatti Vikramarka : ప్రజల ఆశలు, ఆకాంక్షలే మా లక్ష్యం : భట్టి విక్రమార్క
తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలే తమ ప్రభుత్వానికి మొదటి లక్ష్యం అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) మరోసారి పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలే తమ ప్రభుత్వానికి మొదటి లక్ష్యం అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) మరోసారి పేర్కొన్నారు. నేడు భట్టి విక్రమార్క మహబూబ్‌నగర్(Mahabubnager) జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. "ప్రజల ఆశలు, ఆకాంక్షలే మా లక్ష్యం" అని స్పష్టం చేస్తూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt)పై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులపై గత పాలకులు నిర్లక్ష్యం చూపినట్లు ఆరోపించారు. గత పదేళ్లలో ఈ ప్రాంతానికి నీళ్లు అందించలేదని, నిధులు దుర్వినియోగమయ్యాయని విమర్శించారు.
నిధులు సరిగా వినియోగించకపోవడం వల్ల ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు మహబూబ్‌నగర్ జిల్లాకు పునాదిగా నిలిచాయని, బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru-Rangareddy)ను 90 శాతం పూర్తి చేసినట్లు ప్రచారం చేసుకున్నారని, అది పూర్తిగా అబద్దమని, ప్రాజెక్టును అసంపూర్తిగా మధ్యలోనే వదిలేశారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని. దీని ద్వారా బీడు భూములను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ ప్రాజెక్టు ద్వారా మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే తమ లక్ష్యం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సరంలోనే రైతు రుణమాఫీ, ఉచిత బస్సు పథకం, ఆరోగ్య శ్రీ, ఉద్యోగ నియామకాలు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినట్లు చెప్పారు.






