OU : ఓయూ Ph.D. ఎంట్రన్స్ ఫలితాలు విడుదల

by Muthe.Rajitha |

ఓస్మానియా యూనివర్సిటీ (OU) పరిధిలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన Ph.D. ఎంట్రన్స్ పరీక్ష ఫలితాలు(PhD Entrance Results) నేడు విడుదల అయ్యాయి.

OU : ఓయూ Ph.D. ఎంట్రన్స్ ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : ఓస్మానియా యూనివర్సిటీ (OU) పరిధిలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన Ph.D. ఎంట్రన్స్ పరీక్ష ఫలితాలు(PhD Entrance Results) నేడు విడుదల అయ్యాయి. మొత్తం 49 విభాగాల కోసం 9,747 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీటికి సంబంధించిన పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి 27 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) రూపంలో నిర్వహించారు. 7,907 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. వారిలో 4,950 మంది పరీక్షల్లో అర్హత సాధించారు. కాగా వీరందరికీ ర్యాంక్ కార్డులు పోస్టు ద్వారా పంపిస్తామని ఓయూ అధికారులు పేర్కొన్నారు. వీటి కౌన్సిలింగ్ జూలై మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాల కోసం www.ouadmissions.com ను సందర్శించాలని తెలియజేశారు.

Next Story