OU: మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి, స్కూటీలు ఇవ్వాలని ఓయూలో విద్యార్థులు నిరసన

by Ramesh Naini |

మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి ఇవ్వండని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినులు డిమాండ్ చేశారు.

OU: మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి, స్కూటీలు ఇవ్వాలని ఓయూలో విద్యార్థులు నిరసన
X

దిశ, డైనమిక్ బ్యూరో: మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి ఇవ్వండని ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) విద్యార్థినులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ తాజాగా (OU) ఓయూలో విద్యార్థులు (students) నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు మెగా డీఎస్సీ, 4 వేల రూపాయల (Unemployment benefit) నిరుద్యోగ భృతి, విద్యార్థినులకు స్కూటీ ఇవ్వాలని ఓయూ వద్ద విద్యార్థినులు (Postcard) పోస్ట్ కార్డ్ రాసి నిరసన తెలిపారు.

కాగా, గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, నిరుద్యోగుల కోసం (mega DSC) మెగా డీఎస్సీ, రూ.4వేల నిరుద్యోగ భృతి, అమ్మాయిలకు (scooters) స్కూటీలు, తులం బంగారం లాంటి అనేక హామీలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీలను నేరవేర్చాలని మరోవైపు ప్రతిపక్షాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి.

Next Story