యాంటీబయోటిక్స్ అధికంగా వాడొద్దు..! ఉస్మానియా సూపరింటెండెంట్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

యాంటీబయోటిక్స్‌ను నిర్దిష్ట మార్గదర్శకాలకు అనుగుణంగా ఉపయోగించకపోతే ప్రమాదకరమైన రోగకారకాలు మరింత ప్రతిరోధకంగా మారే ప్రమాదం ఉందని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. రాకేష్ సహాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

యాంటీబయోటిక్స్ అధికంగా వాడొద్దు..! ఉస్మానియా సూపరింటెండెంట్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: (Antibiotics) యాంటీబయోటిక్స్‌ను నిర్దిష్ట మార్గదర్శకాలకు అనుగుణంగా ఉపయోగించకపోతే ప్రమాదకరమైన రోగకారకాలు మరింత ప్రతిరోధకంగా మారే ప్రమాదం ఉందని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. రాకేష్ సహాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసుపత్రుల్లో పరిశుభ్రత, ఇన్ఫెక్షన్ కంట్రోల్ చర్యలను కట్టుదిట్టం చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత అవసరమఅని ఆయన పేర్కొన్నారు. శనివారం ఆసుపత్రిలో నిర్వహించిన వరల్డ్ యాంటి మైక్రోబయల్ అవేర్‌నెస్ వీక్-2025 ముగింపు కార్యక్రమంలో రాకేష్ మాట్లాడారు. యాంటి మైక్రోబయల్ రెసిస్టెన్స్‌ బాధ్యతాయుత వినియోగం, కమ్యూనిటీ అవేర్‌నెస్, ఆసుపత్రి స్థాయి నియంత్రణ చర్యల ద్వారా మాత్రమే తగ్గించవచ్చని ఆయన స్పష్టం చేశారు. వైద్యులు, నర్సులు, విద్యార్థులు, సిబ్బందిలో యాంటిమైక్రోబయల్ రెసిస్టెన్స్‌పై అవగాహన పెంచేందుకు నవంబర్ 18 నుంచి 24 వరకు ఆసుపత్రిలో ఫ్లాష్ మోబ్, స్కిట్, క్విజ్, రంగోలి పోటీలు, ఇంటరాక్టివ్ గేమ్స్ నిర్వహించినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమాల ద్వారా సరైన యాంటిబయోటిక్ వినియోగం, చేతుల పరిశుభ్రత, ఆసుపత్రి ఇన్ఫెక్షన్ నివారణ చర్యలను విద్యార్థులు ప్రజలకు చేరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమాలను మైక్రోబయాలజీ విభాగం మరియు ఇన్ఫెక్షన్ కంట్రోల్ టీమ్ సంయుక్తంగా నిర్వహించింది. ల్యాబ్ ఇన్‌చార్జ్ ప్రొఫెసర్ జి.వి. పద్మజా ఆధ్వర్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా. సైదా నజియా ఫాతిమా, డా. ప్రీతి, డా. రాధికా ఏ.కె, క్లినికల్ ఫార్మకాలజీకి చెందిన డా. శ్రీనివాస్ సమన్వయం చేశారు. క్వాలిటీ టీమ్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సులు, నర్సింగ్ ఆఫీసర్లు కార్యక్రమానికి సహకరించారు. విజేతలకు డా. రాకేష్ సహాయ్, ప్రొఫెసర్ పద్మజా బహుమతులు, సర్టిఫికెట్లను అందజేశారు.

Next Story