శరవేగంగా ఉస్మానియా పనులు.. 2027 డిసెంబర్ కల్లా కొత్త భవనం సిద్ధం!

by Ramesh Naini |

ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని నిర్ణీత గడువైన 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ స్పష్టం చేశారు.

శరవేగంగా ఉస్మానియా పనులు.. 2027 డిసెంబర్ కల్లా కొత్త భవనం సిద్ధం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని నిర్ణీత గడువైన 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఆసుపత్రి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనుల్లో ప్రస్తుతం కనిపిస్తున్న వేగాన్ని అదే రీతిలో కొనసాగించాలని సూచించారు. ప్రాజెక్టుకు అవసరమైన అన్ని రకాల అనుమతులను గ్రీన్ ఛానల్ ద్వారా తక్షణమే మంజూరు చేస్తామని, నిధులు లేదా అనుమతుల పరంగా ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

ఈ సమీక్షలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, రహదారులు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి పి. ప్రావీణ్య, సీఈ జి. రాజేశ్వర్ రెడ్డి, టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్, జోనల్ కమిషనర్ బి. సంతోష్, మెడికల్ ఎడ్యుకేషన్ అదనపు డైరెక్టర్ డాక్టర్ ఎన్. వాణి, ఎంఈఐఎల్ ప్రాజెక్ట్ విభాగం అధ్యక్షుడు కె. గోవర్ధన్ రెడ్డి, ప్రాజెక్ట్ చీఫ్ జనరల్ మేనేజర్ వెనిగళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story