- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో మన ఉస్మానియా హవా.. ఫస్ట్ ప్లేస్‌లో ఎయిమ్స్
ఇటీవల ప్రకటించిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్స్ - 2025లో ఉస్మానియా మెడికల్ కాలేజీ 51.46 స్కోరుతో వరుసగా రెండో సారి

దిశ, తెలంగాణ బ్యూరో : ఇటీవల ప్రకటించిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్స్ - 2025లో ఉస్మానియా మెడికల్ కాలేజీ 51.46 స్కోరుతో వరుసగా రెండో సారి దేశంలోనే 48వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్ కోసం దేశ వ్యాప్తంగా 223 మెడికల్ కాలేజీలు పోటీ పడ్డాయి. తెలంగాణ నుంచి ఉస్మానియా, అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఈఎస్సీ మెడికల్ కాలేజీ, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ (సంగారెడ్డి), చల్మెడ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కరీంనగర్) సైతం పోటీపడ్డాయి. కానీ ఉస్మానియా మెడికల్ కాలేజీకి మాత్రమే ఈ గుర్తింపు దక్కింది. ఎయిమ్స్ (న్యూఢిల్లీ) 1వ ర్యాంకులో నిలవగా పీజీఐఎంఈఆర్ (చండీగఢ్), సీఎంసీ (వెల్లూర్), జిప్మర్ (పాండిచేరి) మొదటి మూడు ర్యాంకుల్లో నిలిచాయి. అయితే తెలంగాణ నుంచి గాంధీ మెడికల్ కాలేజీతో పాటు ఇతర ప్రభుత్వ మెడికల్ కాలేజీలేవీ ఈ ర్యాంకింగ్స్ ఫ్రేమ్‌వర్క్స్‌లో పాల్గొనలేదు. 2020 నుంచి 2023 వరకు వరుసగా నాలుగేళ్ల పాటు తెలంగాణ నుంచి ఒక్క మెడికల్ కాలేజీ సైతం ఎన్ఐఆర్ఎఫ్‌లో చోటు సంపాదించలేదు.
ఫార్మసీ విభాగాల్లో రెండు కాలేజీలకు చోటు
ఫార్మసీ విభాగంలో హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 5వ ర్యాంకు దక్కించుకోగా.. అనురాగ్ యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీ 72వ ర్యాంకులో నిలిచింది. జామియా హమ్ దరద్ (న్యూఢిల్లీ), బిట్స్ (పిలానీ), పంజాబ్ యూనివర్సిటీ (చండీగఢ్) వరుసగా మొదటి మూడు ర్యాంకుల్లో నిలిచాయి. ఫార్మసీ విభాగంలో ఆల్ ఇండియా స్థాయిలో 594, రాష్ట్రం నుంచి 45 కాలేజీలు పోటీ పడగా.. రెండు కాలేజీలు మాత్రమే ర్యాంకులు దక్కించుకున్నాయి. ఇక డెంటల్ విభాగంలో ఆల్ ఇండియా స్థాయిలో రాష్ట్రం నుంచి ఒక్క కాలేజీ కూడా సెలెక్ట్ కాలేదు.
ఎన్ఐఆర్ఎఫ్ ఎందుకు..
దేశంలోని విశ్వవిద్యాలయాలు, కాలేజీల స్థాయిని అంచనా వేసే నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. సరైన కాలేజీని ఎంచుకోవడంలో, ప్లేస్‌మెంట్స్ గురించి అవగాహన పొందడంలో ఇవి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ర్యాంకింగ్స్‌లో ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, మెడికల్, లా, విశ్వవిద్యాలయాలు, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వంటి విభాగాల వారీగా జాబితా విడుదల చేస్తారు. దీంతో విద్యార్థులు తమకు కావాల్సిన రంగంలో అత్యుత్తమ విద్యాసంస్థలు ఏవో గుర్తించొచ్చు. అంతర్జాతీయ స్థాయిలోనూ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌కు గుర్తింపు ఉంది. టాప్ ర్యాంకులో ఉన్న ఇన్‌స్టిట్యూట్స్ నుంచి డిగ్రీలు పూర్తి చేసిన వారికి విదేశాల్లో హయ్యర్ స్టడీస్, స్కాలర్‌షిప్స్ పొందడంలో సౌలభ్యంగా ఉంటుంది.






