ORR Toll Charges: నగరవాసులకు బ్యాడ్ న్యూస్.. ఓఆర్‌ఆర్‌పై టోల్‌ ఛార్జీల పెంపు

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-31 09:18:52  IST  )

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఔటర్ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)పై టోల్‌ ఛార్జీలను పెంచుతున్నట్లుగా ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ సంస్థ ప్రకటించింది.

ORR Toll Charges: నగరవాసులకు బ్యాడ్ న్యూస్.. ఓఆర్‌ఆర్‌పై టోల్‌ ఛార్జీల పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఔటర్ రింగ్‌ రోడ్డు (ORR)పై టోల్‌ ఛార్జీ (Toll Charges)లను పెంచుతున్నట్లుగా ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ సంస్థ (IRB Infra Limited) ప్రకటించింది. హెచ్‌ఎండీఏ (HMDA) పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్​(HGCL) నిర్వహణలో ఉండే ఓఆర్‌ఆర్‌ (ORR)ను బీఆర్ఎస్ ప్రభుత్వ (BRS Government) హయాంలో ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్ సంస్థ గత సంవత్సరం 30 ఏళ్లకు లీజుకు తీసుకున్న విషయం విధితమే. అగ్రిమెంట్ ప్రకారం.. ప్రతి సంవత్సరం టోల్​ఛార్జీలను పెంచుకునే వెసులుబాటును కూడా ఆ సంస్థకు కల్పించింది.

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు (Hyderabad Outer Ring Road)పై టోల్‌ ఛార్జీలను పెంచుతున్నట్లుగా ఆ సంస్థ ప్రకటించింది. పెంచిన ఛార్జీలు రేపటి నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. కారు, జీపు, లైట్‌ మోటర్ వెహికల్స్‌కు కి.మీకు రూ.2.34 నుంచి రూ.2.44కు, ఇక మినీ బస్‌, ఎల్‌సీవీలకు కి.మీకు రూ.3.77 నుంచి రూ.3.94కు పెంచారు. అదేవిధంగా 2 యాక్సిల్‌ బస్సులకు కి.మీకు రూ.6.69 నుంచి రూ.7కు, హెవీ వెహికిల్స్‌కు కి.మీ. రూ.15.09 నుంచి రూ.15.78కి ఛార్జీలను పెంచుతూ ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్ సంస్థ ప్రకటన విడుదల చేశారు.

Next Story