ఆర్గానిక్ కొర్రలు తక్కువ ధరకే కావాలా?

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-16 14:20:35  IST  )

పండించిన ధాన్యాన్ని మార్కెట్‌లో అమ్ముకోవడానికి రైతులు ఎంత ఇబ్బంది పడుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయ నాయకులు, దళారులు మధ్య నలిగిపోతుంటారు.

ఆర్గానిక్ కొర్రలు తక్కువ ధరకే కావాలా?
X

దిశ, వెబ్‌డెస్క్: పండించిన ధాన్యాన్ని మార్కెట్‌లో అమ్ముకోవడానికి రైతులు ఎంత ఇబ్బంది పడుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయ నాయకులు, దళారులు మధ్య నలిగిపోతుంటారు. ఒక్కోసారి చివరకు కనీసం గిట్టుబాటు ధర రాదు. ఇలాంటి పరిస్థితులను ముందే ఊహించిన ఓ రైతు వినూత్న ఆలోచన చేశాడు. ఎవరికైతే ధాన్యం అవసరమో నేరుగా వారికే అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ముఖ్యంగా డయాబెటిస్ లాంటి వాటితో బాధపడుతున్న వారికి ఇవి అందించాలనుకున్నాడు. ఇందులో భాగంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లతో ఓ మెసేజ్ పెట్టారు.

‘అందరికీ నమస్కారం. నా పేరు గోవర్ధన్. మా పొలంలో ఈసారి కొర్రలు పండించాము. పంట మంచిగా వచ్చింది. అయితే దళారులకు అమ్మడం ఇష్టం లేక.. హైదరాబాద్‌లో షుగర్, డయాబెటిస్ లాంటి వాటితో బాధపడుతున్న వారికి ఆర్గానిక్ మెథడ్‌లో పండించిన స్వచ్ఛమైన పంట తెచ్చి ఇస్తున్నాను. ఇవి మీ వరకూ చేరాలనేదే నా కోరిక. విడిగా కేజీ రూ.120, పది కేజీలు అయితే రూ.1000కి ఇవ్వగలను. ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే ఇంకొద్దిగా తగ్గించగలను. ఎవరికి అవసరం ఉన్నా నా 81795 38986 ఫోన్ నంబర్‌కు ఫోన్ చేయగలరు’ అని అన్ని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ పెట్టాడు. ప్రస్తుతం ఈ మెసేజ్ వైరల్‌గా మారింది. రైతు ఆలోచనను అంతా మెచ్చుకుంటున్నారు.

మరి రైతుల సొమ్ము దళారులు పాలుకాకుండా ఉండాలంటే ఇలాంటి రైతులను ఆదరించడం మంచిది. మరి ఈ రైతుకు చేయూతనిద్దామనుకునే వాళ్లు వెంటనే ఫోన్ చేయండి.

Next Story