తెలంగాణలో మరొక మున్సిపాలిటీ ఏర్పాటుకు ఆదేశాలు

by Ajay Maddhiboyina |

తెలంగాణలో మరొక మున్సిపాలిటీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. వ‌రంగ‌ల్ జిల్లాలోని నెక్కొండ మేజ‌ర్ గ్రామ పంచాయితీని మున్సిపాలిటీగా మార్చాల‌ని నెక్కొండ మాజీ సర్పంచ్ సొంటిరెడ్డి య‌మున రెడ్డి హైకోర్టులో లంచ్ మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

తెలంగాణలో మరొక మున్సిపాలిటీ ఏర్పాటుకు ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో మరొక మున్సిపాలిటీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. వ‌రంగ‌ల్ జిల్లాలోని నెక్కొండ మేజ‌ర్ గ్రామ పంచాయితీని మున్సిపాలిటీగా మార్చాల‌ని నెక్కొండ మాజీ సర్పంచ్ సొంటిరెడ్డి య‌మున రెడ్డి హైకోర్టులో లంచ్ మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. నెక్కొండ‌, అమీన్ పేట‌, గుండ్ర‌ప‌ల్లి, ప‌త్తిపాక‌, నెక్కొండ తండా, టీకే తండా గ్రామ‌పంచాయితీల‌ను క‌లిపి మున్సిపాలిటీలుగా మార్చాల‌ని పిటిష‌న్ లో పేర్కొన్నారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన ధ‌ర్మాస‌నం స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల కోడ్ నేప‌థ్యంలో వెంట‌నే నోటిఫికేష‌న్ కు ముందే నెక్కొండ మేజ‌ర్ గ్రామ పంచాయితీని మున్సిపాలిటీగా గుర్తించాల‌ని హైకోర్టు ఆదేశించింది.

Next Story