- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగులు కంప్యూటర్ టెస్ట్ పాస్ కావాల్సిందే.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
సచివాలయంలో 2014 మే తర్వాత నియామకం అయిన ఉద్యోగులందరికీ కొత్త రూల్స్ వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: సచివాలయంలో 2014 మే తర్వాత నియామకం అయిన ఉద్యోగులందరికీ కొత్త రూల్స్ వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 12 తర్వాత నియమించబడిన ఉద్యోగులు విధిగా కంప్యూటర్, అనుబంధ సాఫ్ట్‌వేర్ వినియోగంతో ఆఫీస్ ఆటోమేషన్‌లో డిపార్ట్‌మెంటల్ టెస్ట్ ప్రొఫిషియన్సీ టెస్టులో ఉత్తీర్ణులు కావాలని నిబంధన తీసుకొచ్చింది. ఒకవేళ పాస్ కాకపోతే, వారు పోస్టులకు రిక్రూట్ అయినప్పటికీ, టెస్ట్ పాస్ అయ్యే వరకూ ఆ పోస్టుల ప్రయోజనాలను పొందలేరని తెలిపింది.
టీఎస్‌పీఎస్‌సీ ఆధ్వర్యంలో ఈ ఎగ్జామ్‌ను ఏటా రెండు సార్లు నిర్వహిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ సెక్రటేరియట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, 1997 ప్రకారం నియామకం అయిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ స్టెనోగ్రాఫర్, టైపిస్ట్-కమ్-అసిస్టెంట్ల పోస్టుల్లో ఉన్న వారికి ఈ నిబంధనలు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.






