PVC Aadhaar: ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీ.. మహిళలు మీకు ఈ సంగతి తెలుసా?

by Prasad Jukanti |   (  Updated:2025-03-12 04:55:06  IST  )

ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీ.. మహిళలు మీకు ఈ సంగతి తెలుసా?

PVC Aadhaar: ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీ.. మహిళలు మీకు ఈ సంగతి తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ (RTC Free Journey) సౌకర్యం కల్పించింది. మహాలక్ష్మి స్కీమ్ (Mahalakshmi Scheme) కింద రాష్ట్ర పరిధిలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ కూటమి సర్కార్ వచ్చే ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. తెలంగాణలో ఫ్రీ బస్సు జర్నీకి ఆధార్ కార్డును తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ఏపీలోనూ ఇదే విధానం అవలంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం చాలా మంది తమ వద్ద రెగ్యులర్ సైజ్ ఆధార్ కార్డులనే కలిగి ఉన్నారు. ఈ క్రమంలో బస్సుల్లో పెరిగిపోతున్న రద్దీ కారణంగా లాంగ్ సైజ్ ఆధార్ కార్డులను కండక్టర్లకు చూపించడం, దాన్ని భద్రపరచుకోవడం సమస్యగా మారింది. ఈ సమస్యకు పీవీసీ (పాలీ వినైల్ క్లోరైడ్) ఆధార్ కార్డు ద్వారా చెక్ పెట్టే అవకాశం ఉంది. ఏటీఎం కార్డు సైజ్ అంత ఉండే ఈ పీవీసీ (PVC Aadhaar) కార్డు గురించి చాలా మందికి తెలియకపోవడం వల్ల ఫుల్ సైజ్ ఆధార్ కార్డుతో ఇప్పటికీ మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే పీవీసీ కార్డును ఇంట్లో ఉండే ఆన్ లైన్ లో సులభంగా అప్లై చేసుకోవచ్చు.

జస్ట్ రూ.50 తో..

-ఈ కార్డును పొందేందుకు యూఐడీఏఐ అధికారిక వెబ్ సైట్ https://uidai.gov.in/en/ కు వెళ్లాలి. అక్కడ 'మై ఆధార్' సెక్షన్ ఎంచుకోవాలి. అక్కడ వచ్చే పాప్ అప్ మెనూలో 'గెట్ ఆధార్ సెక్షన్' లో 'ఆర్డర్ అధార్ పీవీసీ కార్డు' ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ 12 అంకెల ఆధార్ నెంబర్ లేదా ఎన్ రోల్ మెంట్ ఐడీ నెంబర్ ను ఎంటర్ చేసి తర్వాత సెక్యూరిటీ క్యాప్చను పూరించాలి. దీని తర్వాత సెండ్ 'ఓటీపీ' ఆప్షన్ ను క్లిక్ చేసి ఆధార్ తో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి ఆ తర్వాత పేమెంట్ పూర్తి చేయాలి. ఇందుకు కేవలం రూ.50 మాత్రమే చార్జి చేస్తారు. పేమెంట్ పూర్తయ్యాక మీకు ఆర్డన్ నెంబర్ మెసేజ్ వస్తుంది. ఆర్డర్ చేసిన పది నుంచి పదిహేను రోజుల్లో మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ కు వీవీసీ కార్డు పోస్టులో వస్తుంది. ఈ కార్డు ఏటీఎం సైజ్ లో ఉండటం వల్ల సులభంగా వెంట తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇతర అవసరాలతో పాటు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సులో ఆధార్ మస్ట్ కావడంతో ఈ పీవీసీ కార్డు ఎంతో ఉపయోగపడుతుంది.

Next Story