- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు భారీ వర్ష హెచ్చరిక.. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరువర్షాలు కురుస్తున్నాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరువర్షాలు కురుస్తున్నాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు భారీ నుండి అతిభారీ వర్షాలు రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గాలివేగం గంటకు 50 నుండి 60 కి.మీ వేగంతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా- పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో శనివారం ఉదయం ఏర్పడిన బలమైన అల్పపీడనం అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 9.4 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని, ఎత్తుకు వెళ్లేకొద్దీ ఇది నైరుతి దిశగా వంగి ఉంటుంది. ఈ బలమైన అల్పపీడనం రాబోయే 3 రోజుల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాగల మూడు నాలుగు రోజుల్లో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
వర్షపాతం వివరాలు
కామారెడ్డి జిల్లా బిక్నూర్ లో 6 సెం.మీ, సిద్దిపేట జిల్లా కొండపాకలో 5 సెం.మీ, మంచిర్యాల జిల్లా మంచిర్యాలలో 5 సెం.మీ, కామారెడ్డి జిల్లా లింగంపేట్ లో 5 సెం.మీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో 5 సెం.మీ, సిద్దిపేట జిల్లా దుబ్బాకలో 5 సెం.మీ, ములుగు జిల్లా గోవిందరావుపేటలో 5 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా గూడురువర్గల్ లో 4 సెం.మీ, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో 4 సెం.మీ, ములుగు జిల్లా ములుగులో 4 సెం.మీ, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ లో 4 సెం.మీ, సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ లో 4 సెం.మీ, ములుగు జిల్లా ఏటూరునాగారంలో 4 సెం.మీ, కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ లో 4 సెం.మీ, ఎల్లారెడ్డిలో 4 సెం.మీ, గాంధారిలో 4 సెం.మీ, తాడ్వాయిలో 4 సెం.మీ, దోమకొండలో 4 సెం.మీ, రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో 4 సెం.మీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో4 సెం.మీ, రేగొండలో 4 సెం.మీ, కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో 4 సెం.మీ చొప్పన వర్షాపాతం నమోదైంది.






