- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Sridhar Babu : హెచ్సీయూ భూములపై విపక్షాల అసత్య ప్రచారం : మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం(HCU Land Issue)పై చర్చ నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం(HCU Land Issue)పై చర్చ నడుస్తోంది. ఎన్నో జీవరాశులకు నివాసస్థలమైన వర్శిటీ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని వర్శిటీ విద్యార్థులు, ప్రజాసంఘాలు, ప్రజలు ఆరోపిస్తున్నారు. కాగా ఈ వివాదంపై మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం వర్శిటీ భూములను ఒక్క అంగుళం కూడా తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెందిన భూములు మాత్రమే తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ విషయంలో విపక్షాలు, కొన్ని సంఘాలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం(False Propaganda) చేస్తున్నారని మండిపడ్డారు. వారం రోజుల క్రితమే హెచ్సీయూ వీసీ, రిజిస్ట్రార్ తో తాము సమావేశం అయ్యి, వారికి ఆ భూములు ప్రభుత్వానివే అని స్పష్టం చేశామని తెలిపారు.
గత రెండు రోజులుగా సామాజిక మధ్యమాల్లో ఈ భూములపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. అవన్నీ అబద్దాలని అన్నారు. అక్కడ ఉన్న రాక్ ఫార్మేషన్స్, లేక్ లు, పీకాక్స్.. ఇతర వన్యప్రాణులను కాపాడటానికి అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 400 ఎకరాల ప్రభుత్వ భూమిని న్యాయస్థానాల తీర్పుకు అనుగుణంగానే తీసుకుంటున్నామని.. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పనులకు అడ్డు తగిలితే ఎవ్వరినీ వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు.






