- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Addanki Dayakar : ప్రజా పాలన విజయోత్సవాలను ఓర్వని ప్రతిపక్షాలు : అద్దంకి

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన(Congress Govt rule) ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్, బీజేపీ ఓర్వలేకపోతున్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్(Addanki Dayakar)విమర్శించారు. కాంగ్రెస్ ఏడాది ప్రజాపాలనపై బీఆర్ఎస్ అసూయ పడుతుంటే, బీజేపీ దొంగాటలు ఆడుతుందన్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గ్యారంటీలంతా గారడీలయిపోయాని విమర్శించడం సరికాదని, బీజేపీలాగా మాది బురిడీ కొట్టించే పార్టీ మాది కాదని దయాకర్ వ్యాఖ్యానించారు. సంక్రాతికి గంగిరెద్దులు వచ్చినట్టు బీజేపీ నాయకులు వచ్చి శాపనార్థాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.
దేశాన్ని పాలిస్తున్న ప్రధాని మోడీ, అమిత్ షాలు దేశాన్ని ఏం చేస్తున్నారో ప్రజలకు తెలియంది కాదన్నారు. దేశాన్ని ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ.. ఈరోజు బీజేపీ ఇండియా లిమిటెడ్.. దేశాన్ని దోచుకుంటోందని విమర్శించారు. అదానీ, అంబానీతో బీజేపీ దోపిడి చేయిస్తుందని, బీజేపీలో లాగా కాంగ్రెస్ లో దోపిడి ఉండదన్నారు. ప్రతిపక్షాలను కాదనే తెలంగాణ ప్రజలు మాకు అధికారమిచ్చారన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై శాపనార్ధాలు తప్ప కేంద్రం నుంచి బీజేపీ నేతలు నిధులు మాత్రం ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రమంత్రులున్నా వారి అధినాయకులు చెప్పినట్లుగా ఊగడం తప్ప రాష్ట్రానికి పైస తేవడం చేతకాదని విమర్శించారు.






