- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘బనకచర్ల’ను వ్యతిరేకించడమే నేరం.. GRMB ఉద్యోగిని డిమోట్ చేసిన జలశక్తి
గోదావరి-బనచర్ల (Godavari-Banakacharla) లింక్ ప్రాజెక్టు అంశం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కాకరేపుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: గోదావరి-బనచర్ల (Godavari-Banakacharla) లింక్ ప్రాజెక్టు అంశం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కాకరేపుతోంది. తెలంగాణ (Telangana)లో ఈ ఇష్యూపై అధికార కాంగ్రెస్ (Congress), విపక్ష బీఆర్ఎస్ (BRS) నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (GRMB)లో మెంబర్ సెక్రటరీగా పని చేస్తున్న అళగేశన్ రంగస్వామి (Alageshan Rangaswamy) ఏపీ ప్రభుత్వం నిర్మించబోతున్న బనకచర్ల ప్రాజెక్టు బీఆర్ఎంబీ (GRMB)కి లేఖ రాశారు.
బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంతో పోలవరం ప్రాజెక్టు సామర్ధ్యాలు అన్ని మారిపోతాయని, కాబట్టి మళ్లీ అన్ని రాష్ట్రాల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని లేఖలో అళగేశన్ ప్రస్తావించారు. అదేవిధంగా బనకచర్లకు అనుమతులను వెంటనే నిలిపివేయాలని కేంద్రానికి కూడా వ్యక్తిగతంగా ఓ లేఖ రాశారు. విషయం తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును అళగేశన్ రంగస్వామి వ్యతిరేకిస్తున్నారని, అతడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని కేంద్ర జలశక్తిని డిమాండ్ చేసింది. అయితే, పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగిస్తే తాము తీవ్ర విమర్శలు ఎదురుకోవాల్సి వస్తుందని, బీఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీగా ఉన్న అళగేశన్ రంగస్వామిని టెక్నికల్ మెంబర్‌గా డిమోట్ చేస్తూ కేంద్ర జలశక్తి ఉత్తర్వులు జారీ చేసింది.






