ఆపరేషన్ కగార్ ఆపాలి : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

by Muthe.Rajitha |

ఆపరేషన్ కగార్ వెంటనే ఆపాలని.. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

ఆపరేషన్ కగార్ ఆపాలి : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆపరేషన్ కగార్ వెంటనే ఆపాలని.. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్రం వెనకటి నుండి కార్పొరేట్ల తరఫున తప్ప సామాన్యుల తరఫున ఆలోచన చేయడం లేదన్నారు. తమకు తోచిందే అమలు చేస్తాం.. అధికారం ఉంది కాబట్టి ఇష్టారాజ్యంగా పోతాం అన్నట్లు కేంద్రం వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. మన దేశ పౌరులను మనమే కాల్చుకోవడం మంచిది కాదని.. కేంద్ర ఆ దిశగా ఆలోచన చేయాలని అన్నారు. 2026 మార్చి వరకు మావోయిస్టులను ఏరివేస్తామన్న నిర్ణయం సరికాదని, వ్యక్తులను నిర్మూలించడం ద్వారా ఆలోచనలను నిర్మూలించలేరని చెప్పారు.

కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఎన్‌కౌంటర్ జరగలేదన్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశంగా భావించి ప్రజల అవసరాలను తీర్చడం ద్వారా పరిష్కారం చూపించామన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టాలని కాంగ్రెస్ దాడికి దిగడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. యాసంగి కోతలు పూర్తయి వానాకాలం వచ్చినా కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నదని అన్నారు.

Next Story