పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభించడం ఉపశమనం కలిగించే విషయం: ఎంపీ అసదుద్దీన్

by Malleboina Mahesh |

ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో (MGBS, Metro Station) పాస్ పోర్టు సేవా కేంద్రం ప్రారంభోత్సవం తర్వాత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభించడం ఉపశమనం కలిగించే విషయం: ఎంపీ అసదుద్దీన్
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో (MGBS, Metro Station) పాస్ పోర్టు సేవా కేంద్రం మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (MP Asaduddin Owaisi), రాజ్యసభ సభ్యుడు అనీల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తో కలిసి ప్రారంభించారు. పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గోన్న AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "ఇది తనకు వ్యక్తిగతంగా చాలా ఉపశమనం కలిగించే విషయమని చెప్పుకొచ్చారు. దక్షిణ హైదరాబాద్‌లో ఈ పాస్‌పోర్ట్ సేవా కార్యాలయాన్ని ప్రారంభించడానికి మేము కృషి చేశామని, నేడు అది నిజమైందని గుర్తు చేశారు. ఈ పాస్ పోర్ట్ కేంద్ర MGBS మెట్రో స్టేషన్ లో ఏర్పాటు చేయడం.. దక్షిణ హైదరాబాద్ ప్రజలకు మాత్రమే కాకుండా, దక్షిణ తెలంగాణ ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. మెట్రో స్టేషన్‌లో ఇటువంటి కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం ఇక్కడ ప్రయాణించే వారికి ఈ ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా చేస్తుందని అన్నారు. తాము ఈ అభివృద్ధిని చూడటం తమకు చాలా ఆనందాన్ని ఇస్తుందని ఈ సందర్భంగా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పుకొచ్చాడు.

Next Story