Telangana:ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-07 13:27:02  IST  )

ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ విద్యార్థులకు శుభవార్త వచ్చింది.

Telangana:ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల
X

దిశ,వెబ్‌డెస్క్: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ విద్యార్థులకు శుభవార్త వచ్చింది. తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (TOSS) ఆధ్వర్యంలో ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించిన పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఏడాది(2025) ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి 26 వరకు ఈ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఈ క్రమంలో అధికారులు ఫలితాలను ఇవాళ(శనివారం) అధికారికంగా ప్రకటించారు. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://portal.telanganaopenschool.org/ ద్వారా తెలుసుకోవచ్చు. విద్యార్థులు అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

Next Story