చరిత్ర సృష్టించిన ఓపల్ సుచాత సువాంగ్‌శ్రీ .. 72వ మిస్ వరల్డ్‌గా థాయ్‌లాండ్ సుందరి

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-31 17:34:38  IST  )

హైదరాబాద్ వేదికగా మిస్‌ వరల్డ్-2025 ఫైనల్‌ పోటీలు అంబరాన్నంటాయి.

చరిత్ర సృష్టించిన ఓపల్ సుచాత సువాంగ్‌శ్రీ .. 72వ మిస్ వరల్డ్‌గా థాయ్‌లాండ్ సుందరి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderbad) వేదికగా మిస్‌ వరల్డ్-2025 (Miss World-2025) ఫైనల్‌ పోటీలు అంబరాన్నంటాయి. 2025కు గాను 72వ మిస్ వరల్డ్‌గా థాయ్‌లాండ్ (Thailand) సుందరి ఓపల్ సుచాత సువాంగ్‌శ్రీ (Opal Suchata Suangsri) నిలిచింది. ఈ మేరకు కిరీటాన్ని 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా (Kristina Pizkova), ఓపల్ సుచాత సువాంగ్‌శ్రీకి అలంకరించారు. 1వ రన్నరప్‌గా మిస్‌ ఇథియోపియా, 2వ రన్నరప్‌గా మిస్ పోలెండ్, 3వ రన్నరప్‌గా మిస్‌ మార్టినిక్ నిలిచింది. మిస్ వరల్డ్‌గా ఓపల్ సుచాత సువాంగ్‌శ్రీకి రూ.8.5 కోట్ల నగదు, 1,770 వజ్రాలు పొదిగిన కిరీటంతో పాటు ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్రకు అవకాశం కల్పించనున్నారు. అయితే, టాప్-4లో మార్టినిక్, ఇథియోపియా, పోలెండ్, థాయ్‌లాండ్ దేశాల అందెగత్తెలు నిలవగా.. ఓపల్ సుచాత సువాంగ్‌శ్రీ అత్యుత్తమ సమాధానం చెప్పి మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్నారు. సుచాత థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ జన్మించారు.

కాగా, ప్రపంచ సుందరి 2025 కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు మొత్తం 108 దేశాల సుందరీమణులు ఈ పోటీలో పాల్గొన్నారు. అందులో కేవలం 16 మంది మాత్రమే క్వార్టర్స్‌కు ఎంపికయ్యారు. చివరి రౌండ్‌లో అమెరికా-కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా-ఓషియానా ఖండాల నుంచి విజేతను ఎంపిక చేశారు. ఫైనల్‌కు చేరిన నలుగురిలో తుది ప్రశ్న ద్వారా న్యాయ నిర్ణేతలు (Judges) మిస్‌ వరల్డ్‌ విజేతను ప్రకటించారు.



Next Story