మరో రెండు రౌండ్లే పెండింగ్.. నవీన్ యాదవ్‌కు 23 వేల ఓట్ల ఆధిక్యం

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-14 08:29:59  IST  )

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు (Jubilee Hills Election Counting) ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.

మరో రెండు రౌండ్లే పెండింగ్.. నవీన్ యాదవ్‌కు 23 వేల ఓట్ల ఆధిక్యం
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు (Jubilee Hills Election Counting) ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ (Naveen Yadav) మొదటి రౌండ్ నుంచి లీడ్‌లో కొనసాగుతున్నారు. లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వరుసగా ఎనిమిది రౌండ్లలోనూ బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు వెనుబడే ఉన్నారు. ఎనిమిది రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 23,612 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 101 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 96 ఓట్లు మాత్రమే చెల్లుబాటు కాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు 43, భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి సునీతకు 25, భాజపా అభ్యర్థి దీపక్‌రెడ్డికి 20 ఓట్లు మాత్రమే లభించాయి.

కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ప్రతి రౌండ్‌లో ఆ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ఆధిక్యం పెరుగుతూ వస్తుంది. అయితే, తమ అభ్యర్థి గెలుపు దాదాపు ఖాయం కావడంతో గాంధీభవన్‌ వద్ద ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ముఖ్యనేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని టపాకాయాలు కాలుస్తూ.. ఒకరికొకరు మిఠాయిలు తనిపించుకుంటున్నారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు.

READ MORE .....

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఘన విజయం.. కాసేపట్లో ఈసీ అధికారిక ప్రకటన

Next Story