TG: కడియం అనర్హత పిటిషన్‍పై విచారణ షూరు.. దానం పిటిషన్‍పై ఎక్కడో తేడా!

by Prasad Jukanti |

కడియం అనర్హత పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. ఇక దానం కేసులో సస్పెన్షన్ ట్విస్ట్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

TG: కడియం  అనర్హత పిటిషన్‍పై విచారణ షూరు.. దానం పిటిషన్‍పై ఎక్కడో తేడా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై (MLA Disqualification Petitions) విచారణ కొనసాగుతోంది. స్టేషన్ ఘన్‍పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై (Kadiyam Srihari) దాఖలైన అనర్హత పిటిషన్‍పై ఇవాళ విచారణ జరుగుతోంది. కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో స్పీకర్ విచారణకు వివేకానంద హాజరయ్యారు. స్పీకర్ సమక్షంలో కేపీ వివేకానంద అడ్వకేట్లను కడియం శ్రీహరి అడ్వకెట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయస్తున్నారు. కాగా కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేసిన కేపీ వివేకానంద ఈ నెల 1న స్పీకర్ కు మరిన్ని ఆధారాలు అందజేశారు.

దానం విషయంలో ట్విస్ట్:

కాగా నిన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) అనర్హత పిటిషన్ పై స్పీకర్ విచారణ జరిపారు. ఫిర్యాదుదారులైన కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలను దానం నాగేందర్ తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఈ విచారణ అనంతరం బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. బుధవారం అసెంబ్లీలో స్పీకర్ విచారణ ముగించుకుని బయటకు వచ్చిన ఏలేటి మీడియాతో మాట్లాడుతూ.. దానం నాగేందర్ ను బీఆర్ఎస్ సస్పెండ్ చేసినట్లు సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చారా? అని నన్ను అడిగారు. నిజంగా దానంను బీఆర్ఎస్ సస్పెండ్ చేసినట్లు న్యాయస్థానంలో అఫిడవిట్ సమర్పిస్తే ఈ కేసు నిలవదు. ఇంతకాలం ఈ విషయం బీఆర్ఎస్ ఎందుకు దాచింది అని ఏలేటి ప్రశ్నించారు.

తెరవెనుక ఏం జరుగుతోంది?

ఏలేటి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి. దానంను బీఆర్ఎస్ సస్పెండ్ చేస్తే ఈ కేసు నుంచి దానం సేఫ్ అయినట్లేనని నిజంగానే బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుందా? తీసుకోకుంటే ఏలేటిని విచారణలో ఎందుకు ఈ ప్రశ్న అడిగినట్లు అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. జరిగిన పరిణామాల నేపథ్యంలో దానంపై ఖచ్చితంగా స్పీకర్ చర్యలు తీసుకోక తప్పదనే టాక్ వినిపిస్తున్న వేళ ఏలేటి చేసిన వ్యాఖ్యల వెనుక అసలు ఈ వ్యవహారంలో తెరవెనుక జరుగుతోందనే చర్చ పొలిటికల్ హీట్ రాజేస్తోంది.

Next Story