కొనసాగుతున్న వరద.. జూరాల ప్రాజెక్ట్ 12 గేట్లు ఎత్తివేత

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-29 03:07:34  IST  )

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల (Heavy rains) కారణంగా కృష్ణా నదికి వరద (Flood in Krishna River) పోటెత్తింది.

కొనసాగుతున్న వరద.. జూరాల ప్రాజెక్ట్ 12 గేట్లు ఎత్తివేత
X

దిశ, వెబ్ డెస్క్: ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలలో భారీగా వర్షాలు (Heavy rains) కురుస్తుండటంతో కృష్ణా నదికి వరద (Flood in Krishna River) పోటెత్తింది. దీంతో గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) భారీ వరద కొనసాగుతుంది. అప్రమత్తమైన అధికారులు రాత్రి జూరాల డ్యామ్ లోని.. 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 1,30,000 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 1,44,076 వేల క్యూసెక్కుల వరదను ఔట్ ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, జూరాల డ్యామ్ (Jurala Dam) పూర్తిస్థాయి నీటిమట్టం 318.518 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం నీటిమట్టం 317. 200 మీటర్ల వద్ద కొనసాగుతుంది. ఈ క్రమంలో దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి ప్రవాహం పెరిగింది.

కాగా, రెండు రోజుల క్రితం నీటిని దిగువకు విడుదల చేసే క్రమంలో డ్యామ్ 9వ గేట్ రోప్ తెగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో పాటు మరో రెండు రోప్స్ బలహీనపడటం స్థానిక ప్రజానీకంలో, ఆయకట్టు రైతులలో భయాందోళనలు సృష్టిచింది. దీనిపై స్పందించిన అధికారులు మాత్రం ఎలాంటి ప్రమాదం లేదని, వెంటనే పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇక మొత్తం 67 రేడియల్‌ గేట్లు ఉండగా.. ఎనిమిది గేట్ల రోప్‌లు నీటి తాకిడితో తుప్పుపట్టాయి. వీటిలో నాలుగింటిని ఇటీవలే మార్చారు. మరో నాలుగు గేట్ల రోప్‌లు మార్చాల్సి ఉండగా.. ఈలోపే తెగిపోయాయి.

Next Story