- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
B.Ed One-Year Course : మళ్లీ వన్ ఇయర్ బీఈడీ కోర్సు!

దిశ, వెబ్ డెస్క్ : వన్ ఇయర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ)(One-Year B.Ed Course) విధానా(Policy)న్ని తిరిగి పునరుద్ధరించా(Renewed)లని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) తాజాగా నిర్ణయించింది. 2025 జనవరి 11వ తేదీన సమావేశమైన ఎన్‌సీటీఈ పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో విద్యా నాణ్యతా ప్రమాణాలు పెంచాలన్న లక్ష్యంతో 2014 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ఏడాది బీఈడీ కోర్సును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తరువాత 2015–16 నుంచి రెండేళ్ల బీఈడీ కోర్సును ప్రవేశపెట్టింది. అయితే తాజాగా సమావేశంలో బీఈడీ కోర్సు ఏడాది కాల పరిమితికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసిన లేదా రెండేళ్ల మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులే ఈ కోర్సు చేయవచ్చని ఎన్‌సీటీఈ చైర్మన్ పంకజ్ అరోరా వెల్లడించారు. మూడేళ్ల యూజీ పూర్తి చేసిన వారికి ఇది వర్తించదన్నారు. 2028 నాటికి రెండు సంవత్సరాల బీఈడీని అందించే సంస్థలు మల్టీడిసిప్లినరీ ఇన్‌స్టిట్యూట్‌లుగా మారాలని పంకజ్ అరోరా స్పష్టం చేశారు. కొన్ని నిర్ణయాలపై కేంద్ర విద్యాశాఖతో చర్చిస్తున్నామని చెప్పారు. ఎన్‌సీటీఈ రూల్స్-2025 పేరుతో ముసాయిదాను ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. వన్ ఇయర్ బీఈడీతో పాటు పలు కోర్సుల ఫ్రేమ్‌వర్క్ కోసం ఎనిమిది మంది సభ్యుల ప్యానెల్‌ను కూడా ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు.
జనవరి 11న జరిగిన సమావేశంలో టీచర్స్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ గవర్నింగ్ బాడీ ఒక సంవత్సరం బీఈడీ కోర్సుతో సహా ఉపాధ్యాయ శిక్షణా కోర్సులకు సంబంధించిన పలు నిర్ణయాలను ఆమోదించింది. ఇక ఇదే సమావేశంలో ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఐటీఈపీ) కింద చేపట్టిన 4 సంవత్సరాల డ్యూయల్ డిగ్రీ గ్రాడ్యుయేట్ స్థాయి కోర్సును మరింత విస్తృతం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం కోర్సు దేశ వ్యాప్తంగా 64 సంస్థల్లో బీఏ–బీఈడీ, బీకా మ్–బీఈడీ, బీఎస్సీ–బీఈడీ కోర్సులను అందిస్తుండగా, దీనిని యోగా ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, సంస్కృతం, ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్‌కు విస్తరించాలని నిర్ణయించారు.