"ఒకే దేశం - ఒకే ఎన్నికలు" దేశ అభివృద్ధిలో కీలకం : కిషన్ రెడ్డి

by Bhanu |

"ఒకే దేశం - ఒకే ఎన్నికలు" దేశవ్యాప్త అవగాహన కార్యక్రమంలో భాగంగా, హోటల్ కత్రియా లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు & కేంద్ర బొగ్గు , గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు.

ఒకే దేశం - ఒకే ఎన్నికలు దేశ అభివృద్ధిలో కీలకం : కిషన్ రెడ్డి
X

దిశ, జూబ్లీహిల్స్: "ఒకే దేశం - ఒకే ఎన్నికలు" దేశవ్యాప్త అవగాహన కార్యక్రమంలో భాగంగా, హోటల్ కత్రియా లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు & కేంద్ర బొగ్గు , గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ... స్వాతంత్రం సిద్ధించి 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇంకా బ్రిటిష్ వారి విధానాల్ని అవలంబిస్తున్నామని, ప్రధాని మోడీ ఎప్పుడు చెబుతుంటారు ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి వర్తమాన రాజకీయ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్ని మార్చుకోవాలని, దానికి అనుగుణంగా కొన్ని మార్చుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే మార్చే క్రమంలో వాటికి అడ్డంపడే ప్రయత్నం జరుగుతా ఉంటుంది అని అన్నారు. దాంట్లో భాగంగానే వన్ నేషన్ , వన్ ఎలక్షన్ సంబంధించి ప్రజల్లో చైతన్య నింపాలనీ , ప్రజల మధ్యకు వెళ్లి ప్రజలను చైతన్యం చేయడానికి ప్రయత్నం చేయాలని ప్రధాని మోడీ చెబుతూ ఉంటారు అని పేర్కొన్నారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీల మీద మేధావుల మీద విశ్లేషకుల మీద ఒత్తిడి తీసుకురావాలి ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారాలన్నారు.


దేశంలో ఎక్కడ ఎలక్షన్ జరిగిన దేశమంతా చర్చ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఎన్నో పని గంటలు వృధా అవుతున్నాయి. ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి ఇలాంటి పరిస్థితి ఉండదు అని ప్రసంగించారు. దేశంలో మార్పు రావాలి అది మోడీ నాయకత్వంలోనే మార్పు వస్తుంది జీఎస్టీ విషయంలో కావచ్చు 370 ఆర్టికల్ విషయంలో కావచ్చు మోదీ గారి పట్టుదలతోనే అది సాధ్యమైంది త్రిబుల్ తలక్ విషయంలో కూడా అదే నిజమైంది ఓట్ల కోసం త్రిబుల్ తాళక్ కొనసాగించారు సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన అది కంటిన్యూ చేశారు CAA, న్యూ క్రిమినల్ యాక్ట్, తీసుకోచ్చింది మోదీ ప్రభుత్వమే అని కిషన్ రెడ్డి అన్నారు. నేడు దేశం యొక్క పరిస్థితులు దేశం యొక్క అభివృద్ధి దృష్ట్య వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావాల్సిందే ఎక్కడో ఒకచోట ఎప్పుడు ఎలక్షన్స్ ఉండడం వల్ల సిబ్బందికి ప్రభుత్వానికి ఇది అభివృద్ధికి అడ్డంకి గా మారింది ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి అని, భవిష్య తరాలకు మంచి దేశాన్ని అందించాలంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అవసరం , దీనికి అందరూ ప్రజలు సహకరించాలి. మేధావులు అన్ని వర్గాలు ఆలోచించాలి ప్రజలు సహకరించాలి , ప్రజల్లో చర్చించండి ప్రజల్ని చైతన్యవంతం చేయండి అని సూచించారు. ఇది అన్ని వర్గాలకు సంబంధించిన అంశం అన్ని వర్గాలు చైతన్యంతో ఆలోచించండి ఇది కేవలం ఇక్కడ కూర్చొని మాట్లాడటం కాదు ప్రజల్లో అవగాహన తీసుకురండి అని పిలుపునిచ్చారు.

Next Story