NA ANVESHANA: ప్రపంచ యాత్రికుడికి మరో షాక్.. ఖమ్మం జిల్లాలో కేసు నమోదు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-31 05:21:52  IST  )

యూట్యూబ‌ర్ ప్ర‌పంచ‌యాత్రికుడు అన్వేష్‌కు షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే సీతపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంటూ అన్వేష్ పై కేసు నమోదు అవ్వగా తాజాగా మరో కేసు నమోదైంది.

NA ANVESHANA: ప్రపంచ యాత్రికుడికి మరో షాక్.. ఖమ్మం జిల్లాలో కేసు నమోదు
X

దిశ‌, వెబ్ డెస్క్: యూట్యూబ‌ర్ ప్ర‌పంచ‌యాత్రికుడు అన్వేష్‌కు షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే సీతపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంటూ అన్వేష్ పై కేసు నమోదు అవ్వగా తాజాగా మరో కేసు నమోదైంది. ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో సీతాదేవి, ద్రౌపదిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంటూ దానవాయిగూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణరావు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే అన్వేష్ ఇటీవల నటుడు శివాజీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. హీరోయిన్ల దుస్తులపై శివాజీ వ్యాఖ్యలు చేయగా అన్వేష్ ఆయనను ఖండించాడు. అమ్మాయిలు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటారు నువ్వు ఎవరు అంటూ ప్రశ్నించాడు.

అంతే కాకుండా ప్రవచనకర్త గరికపాటిపై సైతం ఫైర్ అయ్యారు. అయితే ఈ క్రమంలో అన్వేష్ విచక్షణ కోల్పోయి వారిని బూతులు తిట్టాడు. దీంతో అతడిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచి చెప్పాలనుకుంటే పద్ధతిగా మాట్లాడుతూ కూడా చెప్పవచ్చని కానీ పచ్చిబూతులు మాట్లాడటం ఏంటని మండిపడుతున్నారు. అంతే కాకుండా గతంలో అన్వేష్ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అతడిని చాలా మంది అన్ ఫాలో చేశారు. అయినప్పటికీ మరోసారి శాపనార్థాలు పెడుతూ మరో వీడియోను విడుదల చేశాడు. ఈ క్రమంలో అన్వేష్ పై అంతటా అసంతృప్తి వ్య‌క్తం అవుతోంది.

Next Story