- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళల భద్రతపై 'వన్ మినిట్' ఫిల్మ్ ఫెస్టివల్.. టీజీ ఉమెన్ సేఫ్టీ వింగ్ వినూత్న ప్రయత్నం
by Ramesh Naini |
మహిళల భద్రత, బాలల రక్షణపై సమాజంలో మార్పు తెచ్చేందుకు తెలంగాణ మహిళా భద్రత విభాగం, యూనిసెఫ్, అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజీతో కలిసి 'వన్ మినిట్ ఫిల్మ్ ఫెస్టివల్' నిర్వహిస్తోంది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: మహిళల భద్రత, బాలల రక్షణపై సమాజంలో మార్పు తెచ్చేందుకు తెలంగాణ మహిళా భద్రత విభాగం, యూనిసెఫ్, అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజీతో కలిసి 'వన్ మినిట్ ఫిల్మ్ ఫెస్టివల్' నిర్వహిస్తోంది. మహిళలపై వేధింపులు, వివక్షకు వ్యతిరేకంగా యువత తమ సృజనాత్మకతతో గళమెత్తాలని కోరుతున్నట్లు ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏడీజీనీ చారు సిన్హా ఆదివారం ప్రకటన ద్వారా తెలిపారు.
వన్ మినిట్' ఫిల్మ్ ఫెస్టివల్‌లో 18 నుంచి 35 ఏళ్ల లోపు యువత, విద్యార్థులు పాల్గొనవచ్చని కేవలం ఒక నిమిషం నిడివి గల లఘు చిత్రాలను రూపొందించాలని తెలిపారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏ భాషలోనైనా రూపొందిచవచ్చని, చిత్ర నిర్మాణంలో ఏఐ (కృత్రిమ మేధ) వాడకూడదని పేర్కోన్నారు. ఎంపిక చేసిన చిత్రాలకు మార్చి 9న అవార్డులు అందజేయనున్నట్లు తెలిపారు.
Next Story






