- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకప్పుడు రోళ్లు పగిలేవి.. ఇప్పుడు జేబులోని ఫోన్లు పేలుతున్నాయి! నిపుణుల హెచ్చరిక
‘రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి’ అనేది ఒకప్పటి నానుడి.. కానీ ప్రస్తుత ఎండల తీవ్రతకు ఏకంగా జేబులోని సెల్‌ఫోన్లు పేలిపోతున్నాయి. భానుడి భగభగలకు ఎలక్ట్రానిక్ పరికరాలు సైతం తట్టుకోలేక ప్రమాదకరంగా మారుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ‘రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి’ అనేది ఒకప్పటి నానుడి.. కానీ ప్రస్తుత ఎండల తీవ్రతకు ఏకంగా జేబులోని సెల్‌ఫోన్లు పేలిపోతున్నాయి. భానుడి భగభగలకు ఎలక్ట్రానిక్ పరికరాలు సైతం తట్టుకోలేక ప్రమాదకరంగా మారుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రతకు ఓ వ్యక్తి షర్ట్ జేబులోనే మొబైల్ ఫోన్ పేలిపోయిన ఘటన స్థానికంగా ఆందోళన రేకెత్తించింది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా మగ్దుంపూర్ గ్రామానికి చెందిన చంద్ర గౌడ్ అనే వ్యక్తి తన షర్ట్ జేబులో మొబైల్ ఫోన్ పెట్టుకుని ఉన్నాడు. బయట ఉన్న తీవ్రమైన ఎండల కారణంగా జేబులోని ఫోన్ ఒక్కసారిగా విపరీతంగా వేడెక్కి పేలిపోయింది. అయితే, సెల్‌ఫోన్ వేడెక్కడాన్ని గమనించిన బాధితుడు వెంటనే అప్రమత్తం కావడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో అతనికి ఎలాంటి గాయాలు కాలేదు.
వేసవిలో ఎలక్ట్రానిక్ వస్తువులతో జాగ్రత్త..
రోజురోజుకూ ఎండలు మండిపోతున్న నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల బ్యాటరీలు ఉబ్బిపోయి లేదా వేడెక్కి పేలిపోయే ప్రమాదం ఉంటుందని, అందువల్ల ఎండలో ప్రయాణించేటప్పుడు ఫోన్లను ప్యాంట్ లేదా షర్ట్ జేబుల్లో బిగుతుగా ఉంచుకోకూడదని సూచిస్తున్నారు. పరికరం వేడెక్కినట్లు అనిపిస్తే వెంటనే వాడటం ఆపేసి, చల్లబడేలా చూడాలని స్పష్టం చేస్తున్నారు.






