- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rajasingh: కిషన్ రెడ్డిపై మోడీకి ఫిర్యాదు చేయొచ్చుకదా?.. రేవంత్ వ్యాఖ్యలపై రాజాసింగ్ హాట్ కామెంట్స్
కిషన్ రెడ్డి విషయంలో రాజాసింగ్ వెనక్కి తగ్గడం లేదు. తాజాగా మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణకు కేంద్ర ప్రాజెక్టులు రాకుండా అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డే అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) స్పందించారు. రేవంత్ రెడ్డి చిట్ చాట్ (CM Revanth Reddy chit chat) పై స్పందిస్తూ.. రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏమీ అనరు.. ఢిల్లీ వెళ్లగానే కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి మండిపడతారన్నారు. మొన్న కిషన్ రెడ్డి, రేవంత్ రెజ్జి ఓ సభలో కలిశారు. కిషన్ రెడ్డి కలిసినప్పుడు రేవంత్ రెడ్డి అడగొచ్చు కాదా అని నిలీదీశారు. లేదా కిషన్ రెడ్డి (Kishan Reddy) అంశంపై ప్రధాని మోడీని కలిసి రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయవచ్చు కాదా అని ప్రశ్నించారు.
కాగా ఇటీవల కిషన్ రెడ్డి పై రాజాసింగ్ పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఏ మాత్రం అవకాశం దొరికిన చిటపటలాడిపోతున్నారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అంశంపై నిన్న స్పందిస్తూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థిని కుల సమీకరణ ఆధారంగా నిర్ణయిస్తారా? లేక సీనియర్లకు అవకాశం ఇస్తారా? అంటూ రాజాసింగ్ ప్రశ్నలు వేశారు. అయితే ఈ వ్యాఖ్యలు పరోక్షంగా కిషన్ రెడ్డిని ఉద్దేశించినవే అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ పై స్పందించడం ఆసక్తిగా మారింది.






