మీనాక్షి నటరాజన్‌తో భేటీ.. మరోసారి కొండా మురళి హాట్ కామెంట్స్

by Gantepaka Srikanth |

సొంత నేతలపై ఇటీవల కొండా మురళి(Konda Murali) హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

మీనాక్షి నటరాజన్‌తో భేటీ.. మరోసారి కొండా మురళి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సొంత నేతలపై ఇటీవల కొండా మురళి(Konda Murali) హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో కొండా దంపతులకు వ్యతిరేకంగా వరంగల్ కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులంతా ఏకమయ్యారు. మురళిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని పదే పదే అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌‌(Meenakshi Natarajan)తో మంత్రి కొండా సురేఖ(Konda Surekha) దంపతులు భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై ఆమెకు కొండా దంపతులు వివరణ ఇస్తున్నారు. అంతకుముందు కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ.. తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధిని అని అన్నారు. 44 ఏళ్ల నుంచి నా ఎపిసోడ్ కొనసాగుతూనే ఉందని చెప్పారు. తనకు తానుగా ఎవరిమీదా కామెంట్ చేయను.. నా మీద చేస్తే ఊరుకోను అని మరోసారి వార్నింగ్ ఇచ్చారు. తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదని.. ప్రజా బలంతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నానని అన్నారు.

Next Story