మరోసారి కోకాపేట్ భూముల వేలం.. ఈసారి టార్గెట్ రూ.7 వేల కోట్లు

by Kema Shiva Kumar |

భూముల వేలం ద్వారా హెచ్ఎండీఏ వేల కోట్ల ఆదాయాన్ని పెంచుకోవడానికి కసరత్తు చేస్తున్నది.

మరోసారి కోకాపేట్ భూముల వేలం.. ఈసారి టార్గెట్ రూ.7 వేల కోట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూముల వేలం ద్వారా హెచ్ఎండీఏ వేల కోట్ల ఆదాయాన్ని పెంచుకోవడానికి కసరత్తు చేస్తున్నది. కోకాపేట్‌‌లోని నియోపొలిస్ లేఅవుట్, గోల్డ్‌మైన్ లేఅవుట్లలోని 29 ఎకరాలకు నిర్వహించిన వేలంపాటలో హెచ్ఎండీఏకు రూ.3,862.8 కోట్ల ఆదాయం వచ్చింది. నియోపొలిస్ లేఅవుట్ ద్వారా రూ.3,708 కోట్లు, గోల్డెన్ మైల్ లేఅవుట్ ద్వారా రూ.154 కోట్ల ఆదాయం వచ్చింది. ఆదాయంతోపాటు రియల్ ఎస్టేట్ బూమ్ పెరిగిందనడానికి నిదర్శనమని పలువురు బిల్డర్లు, డెవలపర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నియోపొలిసులో ఎకరాకు అత్యధికంగా రూ.151 కోట్లు పలికిన విషయం తెలిసిందే.

మరో 70 ఎకరాలు

కోకాపేట్‌లోని నియోపొలిసు లేఅవుట్‌లో మరో 70 ఎకరాల భూముల వేలం వేయడానికి హెచ్ఎండీఏ కసర త్తు చేస్తున్నది. ఇదే భూమిని 10 ఏండ్ల క్రితం ఐటీ ఎస్‌ఈ జడ్‌కు కేటాయించారు. మొత్తం 11 కంపెనీలకు ఈ భూ మిని లీజుకు ఇచ్చారు. ఇంతవరకు ఒక్క కంపెనీ ఆ భూ మిలో సంస్థలను ఏర్పాటు చేయలేదు. ఇప్పటికే కొన్ని కంపెనీలు లీజు నుంచి విరమించుకున్నట్లు హెచ్ఎండీఏకు తెలిపాయి. కంపెనీలకు ఇచ్చిన గడువు ముగియడం తో భూమి మొత్తం హెచ్‌ఎండీఏ ఆధీనంలో ఉంది. ఈ భూములను హెచ్ఎండీఏ డెవలప్ చేసింది. భారీ స్థాయిలో రోడ్లు, ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేసింది. అయితే భూములను డెవలప్‌మెంట్ చేసిన హెచ్ఎండీఏ భూముల వేలం గురించి లీజు సంస్థల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయిం చింది. దీనికి సదరు సంస్థలు అంగీకరిస్తే భూమిపై హెచ్ఎండీఏకు సర్వహక్కులు రానున్నాయి. పూర్తి హక్కు లు హెచ్‌ఎండీఏకు రానున్నాయి. దీంతో ఆ భూములను సైతం విజయవంతంగా వేలం వేసేందుకు అవకాశాలు ఉన్నాయి.

రూ.10 వేల కోట్లు

నియోపొలిసు లేఅవుట్‌లో ఎకరాకు అత్యధికంగా రూ.151 కోట్లు పలికిన సంగతి తెలిసిందే. ఈ భూముల ను అదే తరహాలో డెవలప్ చేయడంతో ఎకరాకు కనీసం రూ.100 కోట్లు పలికే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఆ లెక్కన 70 ఎకరాలకు రూ.7 వేల కోట్ల ఆదాయం రానుందని అధికారుల అంచనా. ఒక వేళ నియోపొలిసు తరహాలోనే ఎకరాకు రూ.100 కోట్లకు దాటిందంటే రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశాలూ లేకపోలేదని అధికారులు చెబుతున్నారు.

గ్లోబల్ సమ్మిట్‌తో..

భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా రెండు రోజులపాటు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ రియల్ బూమ్ పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ సమ్మిట్‌లో ప్ర పంచలోని పలు అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన విషయం తెలిసిందే. సుమారు రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఆయా సంస్థలు ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్), పెరి అర్బన్ రీజియన్‌లో బహుళా అంతస్తుల భవనాలు వచ్చే అవకాశముందని పలువురు డెవలపర్లు చెబుతున్నారు. అంతేకాదు గ్లోబల్ సమ్మిట్‌తో హైదరాబాద్ బ్రాండ్‌కు ప్రపంచ స్థాయికి చేరిందని క్రెడాయ్ ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

సమ్మిట్‌తో రియల్ రైజింగ్

గ్లోబల్ సమ్మిట్‌తో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపా రంలో రైజింగ్ రానుందని భారత రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ సమాఖ్య పేర్కొన్నది. భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో 1,000 మందికి పైగా ప్రపంచ పెట్టుబడిదారులు, పరిశ్రమల ప్రముఖులను ఆకర్షించింది. ఇది తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగ భవిష్యత్‌పై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తూ తదుపరి వృద్ధి దశకు బలమైన పునాది వేయనుంది. ఈ సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచిన తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్ 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు స్పష్టమైన, మహత్తర రోడ్‌మ్యాప్‌ను ప్రతిపాదించింది. ఇందులో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్), పెరి-అర్బన్ రీజియన్ ఎకానమీ(ప్యూర్), రూరల్ అండ్ అగ్రి రీజియన్ ఎకానమీ(రేర్) అనే సమగ్ర ఆర్థిక నమూనాను అమలు చేయనున్నారు. దీని ద్వారా హైదరాబాద్ కోర్ ప్రాంతంలో రద్దీ తగ్గడంతో పాటు సుస్థిర నివాస, వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త పెట్టుబడి కారిడార్లు అందుబాటులోకి వస్తాయి.

Next Story