- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈనెల 23న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం.. ఆ అంశాలపై కీలక చర్చ!
హైదరాబాద్ గాంధీ భవన్‌లో ఈనెల 23న తెలంగాణ ప్రదేశ్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ గాంధీ భవన్‌లో ఈనెల 23న తెలంగాణ ప్రదేశ్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ భేటికి టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించనున్నారు. సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీగా నూతనంగా నియమితులైన మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు, ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పీఏసీ, పీఈసీ సభ్యులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ ఛైర్మన్‌లు, నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, అధికార ప్రతినిధులు భేటీలో పాల్గొంటారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాలు, పార్టీ సంస్థాగత అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లుగా కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి.
Next Story






