- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయిల్ పామ్ సాగులో ఫర్టిలైజర్ల ‘మాయాజాలం’
రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే స్థిర ఆదాయం పొందుతూ సంతోషంగా ఉన్న ఆయిల్పామ్రైతులపై ఫర్టిలైజర్కంపెనీలు కుట్రలకు తెరలేపాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే స్థిర ఆదాయం పొందుతూ సంతోషంగా ఉన్న ఆయిల్పామ్రైతులపై ఫర్టిలైజర్కంపెనీలు కుట్రలకు తెరలేపాయి. పశువులు, కోళ్ల ఎరువులు వినియోగిస్తే పంట దిగుబడి తక్కువ వస్తుందని, తాము తయారు చేసిన బయోచార్, ఆర్గానిక్ మ్యాటర్, జింక్, ఫెర్రస్లాంటి ఫర్టిలైజర్లువాడితే రెండింతలు కాపు వస్తుందని రైతులను మభ్యపెడుతున్నట్లు తెలుస్తోంది. ఆయిల్‌పామ్ సాగులో ప్రసిద్ధి చెందిన ఖమ్మం జిల్లాలో రైతులకు గతంలో ఇచ్చిన మొక్కలతో ఎకరానికి 12 నుంచి 18 టన్నులు దిగుబడి వస్తోంది. ఆవులు, కోళ్ల ఎరువుతోపాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన ఎరువులు వేసి అత్యధికంగా దిగుబడి సాధించారు. ఈ క్రమంలోనే గత ఐదారేళ్లుగా తెలంగాణ వ్యాప్తంగా సాగు పెరగడంతో ఫర్టిలైజర్ల కంపెనీలు పాత పద్ధతికి స్వస్తి పలికి, తాము సూచించిన ఎరువులు వాడితే గతంలోకన్నా నాలుగైదు టన్నులు ఎక్కువ దిగుబడి వస్తోందని ప్రచారం మొదలు పెట్టాయి. ఒక పక్క ప్రభుత్వం అధిక ఎరువుల వినియోగంతో భూమి సారం కోల్పోయి విషతుల్యం అవుతుందని హెచ్చరిస్తుంటే ఆయా కంపెనీలు మాత్రం మధ్య దళారులను నియమించుకుని తక్కువ ధరలకే ఫర్టిలైజర్అంటూ భూమిని విషతుల్యం చేసే దిశగా కుట్రలు చేస్తున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. మొత్తంగా నకిలీ విత్తనాలతో ఇప్పటికే నిండా మునుగుతున్న రైతులకు నాణ్యత లేని ఫర్టిలైజర్లు సమస్యగా మారుతున్నాయి.
ఇలా చేస్తే చాలు..
గతంలో మామిడి లాంటి దీర్ఘకాలిక ఫలసాయం ఇచ్చే పంటకు కళ్తార్లాంటి గ్రోత్ప్రమోటర్స్ వాడటంతో దాని నియంత్రణ కోసం విపరీతంగా పురుగు, తెగుళ్ల మందులు వాడి చివరికి పంటను తగ్గించే పరిస్థితి వచ్చింది. ఆయిల్‌పామ్‌కు పశువుల, కోళ్ల ఎరువులతోపాటు వాటి మట్టలు ఎప్పటికప్పడు తొలగిస్తే ప్రతి ఎకరంలో ప్రతి సంవత్సరం కనీసం 5 టన్నుల ఆర్గానిక్మ్యాటర్భూమిలో కలుస్తుంది. వీటితోపాటు శాస్త్రవేత్తలు సూచించిన ఫర్టిలైజర్లు పంటకు సరిపోతాయని, అవి గత 30 ఏళ్లుగా సాగు చేస్తున్న రైతులు తమ అనుభవం ద్వారా కొత్త రైతులకు సూచిస్తున్నారు. ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్‌జిల్లాల్లో సారవంతమైన భూములు, నీటి వసతి ఉన్నభూములు ఉండటంతో అక్కడ అధికంగా ఫర్టిలైజర్వాడవద్దని కోరుతున్నారు. కంపెనీలు వాళ్ల లాభాల కోసం తప్ప రైతుల మేలు కోసం ఏనాడూ పనిచేయవని చెబుతున్నారు. మొక్కలకు తెగులు వస్తే స్థానిక ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించి వారి సలహాలు పాటించాలని స్పష్టం చేస్తున్నారు.
98 శాతం తెలుగు రాష్ట్రాల నుంచే..
ప్రస్తుతం భారతదేశంలో ఆయిల్‌పామ్11.75 లక్షల ఎకరాల్లో సాగు చేస్తుండగా ఏడాదికి 3.96 లక్షల మెట్రిక్‌టన్నుల ముడి పామాయిల్ఉత్పత్తి జరుగుతోంది. జాతీయ పామాయిల్డిమాండ్100 లక్షల మెట్రిక్‌టన్నుల ఉంది. ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలంటే దేశంలో సుమారు 70 లక్షల ఎకరాలు సాగు చేయాల్సిన అవసరం ఉంది. దేశీయ పామాయిల్ ఉత్పత్తిలో 98శాతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 73 వేల మంది రైతులు సుమారుగా 2.72 లక్షల ఎకరాల్లో పంటను సాగు చేశారు. ప్రభుత్వం 31 జిల్లాల్లో సాగు విస్తరణ చేపట్టేందుకు 14 కంపెనీలకు అనుమతులు ఇచ్చింది. మరోవైపు మొక్కలు పెంచడం కోసం రాష్ట్రవ్యాప్తంగా 44 నర్సరీలు ఏర్పాటు చేశారు. ఎకరానికి రూ. 50,918 వరకు ప్రభుత్వం రాయితీ ఇస్తున్నది. మొక్కలు, డ్రిప్‌ఇరిగేషన్, మొదటి నాలుగేళ్ల పాటు తోటల యాజమాన్యం అంతర పంటల సాగు కోసం రాయితీ వర్తిస్తుంది.






