- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయారాం.. గయారాం..! రవాణా శాఖలో చిత్రం భళారే విచిత్రం
రాష్ట్రంలో ఆదాయాన్ని సముపార్జించే శాఖల్లో రవాణా శాఖ ఒకటి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఆదాయాన్ని సముపార్జించే శాఖల్లో రవాణా శాఖ ఒకటి. వాహనాల రిజిస్ట్రేషన్, ట్యాక్స్, ఆర్టీఏ సేవల ద్వారా ఏటా పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతున్న ఈ శాఖకు స్థిరమైన అధికారి ఉండడంలేదు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తరువాత గడిచిన 22 నెలల్లో ఐదుసార్లు కమిషనర్లు మారారు. ఈవీ పాలసీతో ఆదాయం కోల్పోతున్న రవాణా శాఖకు ఇటీవలే చెక్ పోస్టుల రద్దు కా స్త ఆదాయాన్ని తగ్గించే విధంగా మారింది. మొదటి సారిగా 2023 డిసెంబర్ 24న బదిలీ జరిగింది. అప్పుడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్‌గా ఉన్న జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను రవాణా కమిషనర్‌గా నియమించారు. అయితే, ఆయన ప దవీ కాలం కేవలం ఆరు నెలలకు మాత్రమే పరిమితమైంది. 2024 జూన్ 24న ఇలంబర్తి కమిషనర్‌గా వచ్చారు. ఆయ న జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బదిలీ కావడంతో 2024 న వంబర్ 12న కె.సురేంద్ర మోహన్ పదవి చేపట్టారు. సురేం ద్ర మోహన్ దాదాపు ఏడాది కాలం పూర్తిగా పదవిలో ఉం డలేదు. 2025 సెప్టెంబర్ 26న ఎం.రఘునందన్ రావు క మిషనర్‌గా వచ్చారు. నెల తిరగకుండానే ఈయన స్థానం లో మరోసారి మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ సెక్రెటరీగా ఉన్న ఇలంబర్తిని అక్టోబర్ 31న మరోసారి రవాణా శాఖ క మిషనర్‌గా నియమించారు.
రెండేళ్లలో పని చేసిన రవాణా శాఖ కమిషనర్లు వీరే..
1. జ్యోతి బుద్ధ ప్రకాశ్ (6 నెలలు)
2. ఇలంబర్తి (4 నెలల 18 రోజులు)
3. సురేంద్ర మోహన్ (10 నెలలు 13 రోజులు)
4. రఘునందన్ రావు (1 నెల 5 రోజులు)
5. ఇలంబర్తి (మరోసారి కమిషనర్‌గా రాక)






