Ganja Smuggling: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి పట్టివేత

by Naga Rani Yarlagadda |

గోల్డ్, డ్రగ్స్ స్మగ్లింగ్లతో నిత్యం వార్తల్లో నిలిచే శంషాబాద్ ఎయిర్ పోర్టులో (Shamshabad Airport) భారీగా గంజాయి (Cannabis Smuggling) పట్టుబడింది.

Ganja Smuggling: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: గోల్డ్, డ్రగ్స్ స్మగ్లింగ్లతో నిత్యం వార్తల్లో నిలిచే శంషాబాద్ ఎయిర్ పోర్టులో (Shamshabad Airport) భారీగా గంజాయి (Cannabis Smuggling) పట్టుబడింది. ఓ ప్రయాణికుడు ఓజీ కుష్ అనే గంజాయిని 24 బ్యాగుల్లో తరలిస్తున్నట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. భారీగా గంజాయి పట్టుబడటంతో ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతి ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

కాగా.. నిన్న భునగిరిలో సుమారు రూ.10 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు ధ్వంసం (Cannabis Dispose) చేశారు. 2024-25 లో పలు కేసుల్లో 2010.135 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, దానంతటినీ కాల్చివేశామని డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్ పర్సన్, రైల్వే ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. మొత్తం 74 కేసుల్లో రూ.10 కోట్ల 5 లక్షల 6,750 విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాల రవాణా, నియంత్రణ, అసాంఘిక, శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా సికింద్రాబాద్, ఖాజీపేట రైల్వేస్టేషన్లతో పాటు చర్లపల్లి, జనగామ, భువనగిరి తదితర రైల్వేస్టేషన్లలో కొత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story