- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OG Pre Release: కాంగ్రెస్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో డైలాగ్ వార్.. ఏం జరిగిందంటే?
ఓజీ ఈవెంట్ పై సోషల్ మీడియాలో డైలాగ్ వార్ మొదలైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా పక్కా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఓజీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (OG Event) ఎల్బీ స్టేడియంలో నిన్న గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్ లో పవన్ యమా హుషారుగా కనిపించారు. పొలిటికల్ టచ్ ఇస్తూ పవన్ పేల్చిన డైలాగులు ఫ్యాన్స్ లో జోష్ నింపాయి. అయితే తాజాగా ఈ ఈవెంట్ పై సోషల్ మీడియాలో కాంగ్రెస్ అభిమానులకు పవన్ అభిమానులకు మధ్య డైలాగ్ వార్ (Dialogue War) మొదలు కావడంతో సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
పండగ శుభాకాంక్షలు చెప్పరా?:
ఈవెంట్ పై కాంగ్రెస్ పార్టీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో పండగనాడు ఈవెంట్ పెట్టి.. కనీసం స్పీచ్ లో బతుకమ్మ పండగ శుభాకాంక్షలు చెప్పలేదని విమర్శిస్తున్నారు. అంత వర్షంలోనూ ఈవెంట్‍కు భద్రత కల్పించి సహకరించిన పోలీసులకు పవన్ ధన్యవాదాలు తెలపకుండా మర్చిపోవడం బాధాకరం అని సోషల్ మీడిాయలో పోస్టులు చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పవన్ తన బాధ్యతను మరిచిపోయారంటూ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.
పవన్ ఫ్యాన్స్ రివర్స్ కౌంటర్:
వస్తున్న విమర్శలపై పవన్ ఫ్యాన్స్ అంతే స్ట్రాంగ్‍గా కౌంటర్లు ఇస్తున్నారు. పవన్ ఏది చేసినా విమర్శించేందుకు కొంత మంది రెడీగా ఉంటారని నిన్న గ్రౌండ్ లో ఉన్న పరిస్థితి అర్థం చేసుకోవాలి అంటూ రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. పవన్ కల్యాన్ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు చెప్పలేదని వస్తున్న విమర్శలు తప్పని, డిప్యూటీ సీఎం హోదాలో తన ఎక్స్ ఖాతాలో తెలంగాణ ఆడపడుచులందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టు చేశారని కౌంటర్ ఇచ్చారు. అలాగే సినిమా పరిశ్రమకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుతున్న ప్రోత్సాహకాలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ జనసేన పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారని 'ఓజీ కన్సెర్ట్' అనుమతులు ఇవ్వడంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించిందని, తెలంగాణ మంత్రివర్గ సభ్యులకు, తెలంగాణ రాష్ట్ర డీజీపీ, హైదరాబాద్ సీటీ సీపీ సీవీ ఆనంద్ కు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపిపారంటూఅందుకు సంబంధించిన స్క్రీన్ షార్టులు షేర్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో మొదలైన ఈ ట్వీట్ల వార్ ఎక్కడి వరకు చేరుతుందో చూడాలి మరి.






