సీఎం అయితే వేళాపాళా ఉండదా..? కేసీఆర్‌పై ఉద్యోగుల గుర్రు!

by Nagaya |
సీఎం అయితే వేళాపాళా ఉండదా..? కేసీఆర్‌పై ఉద్యోగుల గుర్రు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ సెక్రటేరియట్‌కు వేళాపాళా లేకుండా వస్తున్నారనే చర్చ ఉద్యోగ వర్గాల్లో జరుగుతున్నది. ఆఫీసు క్లోజింగ్ టైంలో సీఎం రావడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని బయటికి చెప్పుకోలేక, అలాగని బాధను భరించలేక మథనపడుతున్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ముగిసిన తర్వాత ఆయన నేరుగా సెక్రటేరియట్‌కు వచ్చారు. దీంతో మెజార్టీ శాఖల ఐఏఎస్‌లు ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉండిపోయారు. వారితోపాటు ఆయా శాఖల స్టాఫ్ కూడా ఇంటికి వెళ్లకుండా సెక్రటేరియట్‌కే పరిమితమయ్యారు.

సెలవుల్లోనూ పని తప్పదా?

ఈనెల రెండో శనివారం సీఎం కేసీఆర్ ఉదయం 11 గంటల ప్రాంతంలో సెక్రటేరియట్‌కు వచ్చి సాయంత్రం 5 తర్వాత ఇంటికి వెళ్లారు. దీంతో చాలామంది ఐఏఎస్‌లు, ఆ శాఖలకు చెందిన అధికారులు సెలవును పక్కన పెట్టి డ్యూటీకి వచ్చారు. అయితే వర్కింగ్ అవర్స్‌లో కాకుండా నాన్ వర్కింగ్ అవర్స్‌లో సీఎం సెక్రటేరియట్‌కు రావడంపై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ శాఖ సెక్రటరీని పిలుస్తారో తెలియదు. దీంతో పలు కీలక శాఖలకు చెందిన ఐఏఎస్‌లు సీఎం ఉన్నంత సేపు సెక్రటేరియట్‌లో ఉంటున్నారు. ఐఏఎస్‌లు ఆఫీసులోనే ఉండటంతో ఇతర అధికారులు, ఉద్యోగులు, చివరికి అటెండర్స్, లిఫ్ట్ బాయ్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఓ గంట ఆలస్యమైతే పర్లేదు కానీ నాలుగైదు గంటలు వెయిట్ చేయించడం సరిగా లేదని ఆవేదన చెందుతున్నారు.

ఉన్నంత సేపు అదనపు భద్రత

కొత్త సెక్రటేరియట్ అందుబాటులోకి రాకముందు ప్రగతిభవన్ కేంద్రంగా పరిపాలన కొనసాగింది. అయితే అక్కడికి పిలిచిన అధికారులు మాత్రమే వెళ్లేవారు. లోనికి కేవలం అధికారులకు మాత్రమే అనుమతి ఉండటంతో ఇతర ఉద్యోగులు, ఆఫీస్ బాయ్స్ ఆఫీసుకే పరిమితమయ్యేవారు. సెక్యూరిటీ కూడా ప్రగతిభవన్ చుట్టూ పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు సీఎం సెక్రటేరియట్‌కు రావడం నుంచి వెళ్లేంత వరకు ఆయన కోసం అదనపు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఏ క్షణంలో బయటికి వస్తారో తెలియని పరిస్థితి ఉండటంతో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడం పెద్ద సమస్యగా మారిందని పోలీసు వర్గాల్లో టాక్ నడుస్తోంది.

Also Read..

బిగ్ న్యూస్: కర్నాటక రిజల్ట్‌తో KCR టార్గెట్ చేంజ్.. ఇకపై సీఎం ఫోకస్ ఆ పార్టీపైనే..?

Next Story

Most Viewed