- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యాన పంటలే ఉత్తమం.. యాసంగిలో సాగుకు రైతుల ఆసక్తి
ఈ యాసంగి సీజన్‌లో ఉద్యాన పంటలు సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. సాధారణ పంటలైన వరి, పత్తి, మొక్కజొన్న పంటల కంటే ఎక్కువ ఆదాయం రావడం, సులభంగా పంటలు ఆమ్ముకునేలా మార్కెట్లు ఉండటమే ఇందుకు కారణం.

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ యాసంగి సీజన్‌లో ఉద్యాన పంటలు సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. సాధారణ పంటలైన వరి, పత్తి, మొక్కజొన్న పంటల కంటే ఎక్కువ ఆదాయం రావడం, సులభంగా పంటలు ఆమ్ముకునేలా మార్కెట్లు ఉండటమే ఇందుకు కారణం. ఈ ఏడాది వరి, పత్తి, మొక్కజొన్న వేసి రైతుల పెద్ద మొత్తంలో నష్టపోయిన అప్పల పాలైయ్యారు. కూరగాయలు, పండ్ల తోటలు వేసిన రైతులు తక్కువగా నష్టపోయారు. దీంతో చాలా మంది రైతులు ఉద్యవ పంటలు వేసేందుకు సంబంధిత శాఖ అదికారులను ఆశ్రయిస్తూ తమ భూమిలో ఏ విధంగా పంటలు సాగుచేయాలో సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఏ పంటకు ఎంత సబ్సిడీ వస్తుంది, అమ్మకాలు చేయాలంటే సమీప మార్కెట్ల వివరాలను తెలుసుకుంటున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలైన రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, భువనగిరి, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్‌లో కూరగాయలు పండించేందుకు రైతులు ముందుకు వస్తున్నారు.
ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు
ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఉద్యాన పంటలకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం సబ్సిడీ ఇస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, సన్న, చిన్న కారు, బీసీ రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం రాయితీ పంపిణీ చేస్తున్నాయి. పంటల సాగులో పాత పద్ధతులు వీడి వాణిజ్య పంటలైన పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాల పంటలకు సాగు చేసేలా రాష్ట్ర ఉద్యాన శాఖ అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యాన పంట విస్తీర్ణం 12.96 లక్షల ఎకరాలు కాగా 42.58 లక్షల మెట్రిక్‌టన్నుల మామిడి, తీపి నారింజ, నిమ్మ, జామ, దానిమ్మ, టమాటా, వంకాయ, ఆయిల్‌పామ్, జీడిపప్పు, మిరపకాయల పంట ఉత్పత్తి అవుతుంది. హైదరాబాద్ నగరానికి కూరగాయలు, పండ్లు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోకుండా ఇక్కడే పండించాలనే ప్లాన్‌తో ఉద్యాన శాఖ ఊరురా అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్దమైంది.
సబ్సిడీ ఇలా..
డ్రాగన్ ఫ్రూట్ రూ. 85 వేలు, ముదురు మామిడి తోటల పునరుద్ధరణ రూ.8,500, టిష్యు కల్చర్ కింద అరటి సాగుకు రూ.16,500, ఆవకాడో రూ.12 వేలు, బొప్పాయి 7,300, మామిడి, నిమ్మ, జామ పంటల సాగుకు రూ.19,200 అందిస్తోంది. మిర్చి, టమాటా, వంకాయ, క్యాబేజీ, కాలిఫ్లవర్ కు రూ.10 వేలు, తాడు సాయంతో కూరగాయల సాగుకు, షేడ్‌నెట్ విధానంలో పువ్వులు, కూరగాయల సాగుకు రూ.4వేలు రాయితీ ఉంది. గులాబీ, మల్లె తోటల పెంపకానికి రూ.8 వేలు, దుంప పువ్వులకు రూ. 10 వేలు, మల్చింగ్ విధానంలో పండ్లు, కూరగాయలు, పువ్వుల సాగులకు రూ.8 వేలు, 15 ఏళ్లు శాశ్వత పందిరి సాగు చేసే రైతులకు అర ఎకరానికి రూ.50 వేల సాయం అందుతుంది.
తేనెటీగల పెంపకానికి 700 బాక్స్ లకు ఒకదానికి రూ.25వేలు తేనె తీసే పరికరానికి రూ.8500 రాయితీ లభిస్తుంది. ప్యాకింగ్, గ్రేడింగ్ షెడ్లు నాలుగు యూనిట్లకు రూ.2 లక్షలు సబ్సిడీ పంపిణీ జరుగుతుంది. ప్రీ కూలింగ్ యూనిట్లకు ఒక్కో యూనిట్ కు రూ.1.75 లక్షలు, కాయలను మాగబెట్టే యూనిట్ కు రూ.35 లక్షలు, మూడు చిన్న ట్రాక్టర్లకు రూ.2.45 లక్షలు, 9 పవర్ టిల్లర్లకు రూ.లక్ష , 18 పవర్ వేడర్లకు ఒక్కో దానికి రూ.75వేలు, 29 బ్రష్ కట్టర్లకు ఒక్కో దానికి రూ.25 వేలు, వర్మికంపోస్టు యూనిట్లకు రూ.50 వేల రాయితీ పంపిణీ చేస్తోంది.






