- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BJP: అధికారిక ప్రకటన.. బీజేపీ జిల్లాల కొత్త అధ్యక్షులు వీరే
తెలంగాణలో జిల్లా అధ్యక్షులను బీజేపీ అధికారికంగా ప్రకటించింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సంస్థాగత నిర్మాణం మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించిన బీజేపీ (BJP) పార్టీ తాజాగా జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. మొత్తం 19 జిల్లాలకు నూతన అధ్యక్షులను (District Presidents), ఆ జిల్లాలకు సంబంధించి 52 అసెంబ్లీ నియోజకవర్గాలకు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను స్టేట్ బీజేపీ ఎలక్షన్ ఆఫీసర్ ఎండల లక్ష్మీనారాయణ (Endela Lakshminarayana) అధికారికంగా నియమించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లుకి వస్తాయని సోమవారం పార్టీ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. అయితే 19 మంది జిల్లా అధ్యక్షులలో ఒక్కరు కూడా మహిళా నేత లేకపోవడం గమనార్హం. కాగ మిగతా చోట్ల అధ్యక్షుడి పోస్టు విషయంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో ఆ జిల్లాల్లో అధ్యక్షుడి నియామకాలు వాయిదా పడినట్లు తెలుస్తోంది. సంస్థాగత నియామకాల విషయంలో ముందడుగు వేసిన బీజేపీ ఇక రాష్ట్ర అధ్యక్షుడి విషయంలోనూ ఈ నెలలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నెల 15వ తేదీ నాటికి తెలంగాణ కమల దళానికి కొత్త బాస్ నియామకం పూర్తయ్యే సూచనలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అధ్యక్ష రేస్ లో ఉన్న వారి పేర్లను వడపోసిన అధిష్టానం అన్ని కోణాల్లో ఆలోచన చేసి నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
జిల్లా పేరు అధ్యక్షుని పేరు
1.ఆదిలాబాద్ - పంతంగి బ్రహ్మానంద్
2.మంచిర్యాల - వెంకటేశ్వర్ గౌడ్
3.కొమరం బీం ఆసిఫాబాద్ - శ్రీశైలం ముదిరాజ్
4.నిజామాబాద్ - దినేశ్ కులాచారి
5.కామారెడ్డి - నీలం చిన్న రాజులు
6.జగిత్యాల రాచకొండ - యాదగిరి బాబు
7.పెద్దపల్లి - కర్రె సంజీవ్ రెడ్డి
8.మెదక్ - వల్దాస్ రాధామల్లేశ్ గౌడ్
9.మేడ్చల్ మల్కాజిగిరి రూరల్ - బుద్ది శ్రీనివాస్
10. నల్గొండ - నాగం వర్షిత్ రెడ్డి
11.మహబూబ్ నగర్ - పి.శ్రీనివాస్ రెడ్డి
12.వనపర్తి - దుప్పల్లి నారాయణ
13.హన్మకొండ - కొలను సంతోశ్ రెడ్డి
14.వరంగల్ -గంట రవి కుమార్
15. జయశంకర్ భూపాలపల్లి - నిశిధర్ రెడ్డి
16. జనగామ - సౌడ రమేశ్
17. ములుగు - సిరికొండ బలరాం
18.మహంకాళి సికింద్రాబాద్ - గుండగోని భరత్ గౌడ్
19.హైదరాబాద్ సెంట్రల్ - లంకాల దీపక్ రెడ్డి






