- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
17 మంది ఉద్యోగ సంఘాల నేతలకు OD ఫెసిలిటీ
తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ రాష్ట్ర స్థాయిలో శాశ్వత సభ్యత్వం కలిగిన వివిధ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు ‘అదర్ డ్యూటీ’ (OD - On Duty) సౌకర్యాన్ని కల్పిస్తూ సాధారణ పరిపాలన శాఖ (GAD) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఓడీ ఫెసిలిటీ కల్పించిన వారిలో.. తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ (టీఎన్‌జీఓ సెంట్రల్ యూనియన్), తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీఓ సెంట్రల్ అసోసియేషన్), ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (PRTU), తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ (ట్రెసా), తెలంగాణ క్లాస్-4 ఎంప్లాయిస్ సెంట్రల్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (TS UTF), తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (TRTF)లకు చెందిన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. వీరితో పాటు తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ (TGSA) అధ్యక్షుడితో కలిపి మొత్తం 17 మంది ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఈ ఓడీ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.






