Black magic: ప్రభుత్వ పాఠశాలలో క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో విద్యార్థులు!

by Ramesh Naini |

కరీంనగర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో క్షుద్రపూజల కలకలం కలకలం రేపుతున్నాయి.

Black magic: ప్రభుత్వ పాఠశాలలో క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో విద్యార్థులు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలలో (Black magic) క్షుద్రపూజల కలకలం కలకలం రేపుతున్నాయి. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు (Karimnagar) కరీంనగర్ మండలం దుర్శేడ్ గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో ప్రధానోపాధ్యాయుడి గది ముందు పసుపు, కుంకుమతో పాటు నిమ్మకాయలు పెట్టి క్షుద్రపూజలు చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది.

కాగా, రెండు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండలోని బాలికుంట గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో కూడా క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లతో కలకలం రేకెత్తించింది. పాఠశాల భవనం ఆవరణలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఎండుమిర్చి, ముగ్గు వేసి ఉండటంతో విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. అయితే, కావాలని కొంత మంది ఆకతాయిలు ఇలా చేసి ఉంటారని ఎంఈఓ సత్యనారాయణ తేల్చి చెప్పారు.

Next Story