- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Raj Bhavan: కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్.. హాజరైన CM రేవంత్
తెలంగాణ కొత్త మంత్రులు రాజ్‌భవన్(Raj Bhavan)లో ప్రమాణస్వీకారం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కొత్త మంత్రులు రాజ్‌భవన్(Raj Bhavan)లో ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma) వారిచేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఉన్నారు. కాగా, ఈ తాజా విస్తరణలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే అవకాశం కల్పించింది. మరోవైపు.. మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల పేర్లు మొదటి నుంచీ వినిపించినా ప్రస్తుతానికి ఎస్సీ, బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని అధిష్టానం చెప్పినట్లు తెలిసింది. వీరితో పాటు శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్రునాయక్‌ను ఎంపిక చేసింది.






