T BJP:కేసీఆర్ ఫ్యామిలీలో త్వరలోనే మరో సంచలనం.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

by Prasad Jukanti |   (  Updated:2025-05-27 10:27:27  IST  )

రాబోయే ఆరు నెలలు తెలంగాణకు, బీఆర్ఎస్, కాంగ్రెస్ కు క్రుషియల్ పీరియడ్ అని తెలంగాణ బీజేపీ సంచలన వ్యాఖ్యలు చేసింది.

T BJP:కేసీఆర్ ఫ్యామిలీలో  త్వరలోనే  మరో సంచలనం.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పిన కేసీఆర్ ఫ్యామిలీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. కవిత లేఖతో గులాబీ బాస్ కుటుంబంలో ఏం జరుగుతోందనే చర్చ కారు పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో త్వరలో కేసీఆర్ కుటుంబంలో మరో సంచలనం చోటు చేసుకోబోతున్నదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (NVSS Prabhakar) హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కుటుంబంలో అంతర్గత విభేదాలు తారా స్థాయికి చేరాయని ఎమ్మెల్సీ కవిత (Kavitha) మరో షర్మిల కాబోతున్నారని చెప్పారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కవిత బాధ తాను కేసీఆర్ కు తాను రాసిన లేఖ బయటపడిందని కాదని, రాజకీయ పార్టీలతో కుదిరిన డీల్ బయటపడిందనే కవిత ఆవేదన అని ఆరోపించారు. అందికారంలో ఉండగా దోచుకున్నవారిని ఎలా కాపాడుకోవాలని వీళ్లు ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ బతుకులు బట్టబయలు చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డీల్ కుదిరిందని నేతల మధ్య రాజీ కుదిరిందని ఈ వ్యవహారం బయటకు ఎలా పొక్కిందనే విషయంలో కేసీఆర్ కుటుంబంలోని (KCR Family) నలుగురి మధ్య తర్జనభర్జనలు జరుగుతున్నాయన్నారు. రాబోయే ఆరునెలలు తెలంగాణకు, బీఆర్ఎస్, కాంగ్రెస్ కు అత్యంత కీలకం అని వ్యాఖ్యానించారు.

Next Story